కాంగ్రెస్ లో చేరిన షకీలా..తమిళనాడు ఎన్నికల్లో ప్రచారం

తమిళనాడులో ఎన్నికలు జరగనున్న వేళ శృంగార తారగా గుర్తింపు పొందిన సినీ నటి షకీలా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ లో చేరిన షకీలా..తమిళనాడు ఎన్నికల్లో ప్రచారం

Actress Shakeela Joins Congress Ahead Of Tn Assembly Election1

Shakeela తమిళనాడులో ఎన్నికలు జరగనున్న వేళ శృంగార తారగా గుర్తింపు పొందిన సినీ నటి షకీలా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంతకాలంగా తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని చెబుతున్న షకీలా.. ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. తమిళనాడు కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆమె పార్టీలో చేరి సభ్యత్వ కార్డు తీసుకున్నారు. ఇక మీదట తమిళనాడు కాంగ్రెస్ హ్యూమన్ రైట్స్ వింగ్ లో షకీలా పనిచేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా షకీలా పాల్గొనబోతున్నట్లు సమాచారం.

ప్రజలకు సేవ చేయాలంటే అధికారం ఉండాలి.. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో ఉండడం ద్వారా నా లక్ష్యం నెరవేరుతుంది అని పార్టీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ షకీలా స్పష్టం చేశారు. షకీలా చేరిక ఎన్నికల్లో తమకు కలిసివస్తుందని తమిళనాడు కాంగ్రెస్ నేతలు తెలిపారు.

దక్షిణాది సినీ ప్రపంచంలో అతి తక్కువ కాలంలోనే వందలాది చిత్రాల్లో నటించిన షకీలా.. శృంగార తారగా ప్రేక్షకుల్లో ఆదరణ పొందారు. మలయాళం, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించారు. 1995లో 18 ఏళ్ల వయస్సులోనే ‘ప్లేగర్ల్స్‌’ చిత్రంలో నటించారు. ఒకప్పుడు మలయాళంలో అగ్ర కథానాయకులకు పోటీగా ఆమె సినిమాలు విడుదలయ్యేవి. దక్షిణాదిలో మరే సినీ తారకు రానంత క్రేజ్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా తెలుగులోనూ వరుస అవకాశాలు దక్కించుకున్న షకీలా కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు.

ఇక, గతేడాది ఆమె జీవితకథ ఆధారంగా బయోపిక్‌ కూడా విడుదలైంది. ఆమె పాత్రలో బాలీవుడ్‌ నటి రిచా చద్దా నటించారు. ఇటీవల, అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ రియాలిటీ షో కుక్ విత్ కోమలిలో షకీలా పాల్గొన్నారు. కోమాలి సీజన్ 2 తో కుక్‌లో కంటెస్టెంట్ గా వచ్చిన షకీలాకు భారీ సంఖ్యలో అభిమానుల మద్ధతు లభించింది. ఎలిమినేషన్ తర్వాత ఆమె ఈ వారం వైల్డ్-కార్డ్ పోటీదారుగా కూడా వస్తున్నారు.