Sreeleela: యోగా మ‌హోత్స‌వ్‌లో శ్రీలీల కామెంట్స్‌.. వ‌ర్క‌వుట్స్ చేయ‌డం ఇష్టం ఉండ‌దు

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం శ్రీలీల హ‌వా న‌డుస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు, పర్యాటక మంత్రిత్వ శాఖ హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన యోగా మ‌హోత్స‌వ్‌లో శ్రీలీల పాల్గొంది.

Sreeleela: యోగా మ‌హోత్స‌వ్‌లో శ్రీలీల కామెంట్స్‌.. వ‌ర్క‌వుట్స్ చేయ‌డం ఇష్టం ఉండ‌దు

Sreeleela In Yoga Mahotsav

Sreeleela In Yoga Mahotsav: టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం శ్రీలీల హ‌వా న‌డుస్తోంది. ‘పెళ్లి సందD'(PellisandaD) చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అమ్మ‌డు వ‌రుస సినిమాల్లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల మ‌దిలో త‌న‌దైన ముద్ర వేస్తోంది. ప్ర‌స్తుతం ఏ ఫంక్ష‌న్‌లోనైనా శ్రీలీల‌నే క‌న‌ప‌డుతోందంటే అతిశ‌యోక్తి కాదేమో. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు, పర్యాటక మంత్రిత్వ శాఖ హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన యోగా మ‌హోత్స‌వ్‌లో శ్రీలీల పాల్గొంది.

కొద్దిసేపు అంద‌రితో క‌లిసి యోగాస‌నాలు వేసింది. అనంత‌రం ఆమె మాట్లాడుతూ యోగా యొక్క ప్రాముఖ్యతను వివ‌రించింది. త‌న‌కు ఫిజిక‌ల్‌గా వ‌ర్క‌వుట్స్ చేయ‌డం పెద్ద‌గా ఇష్టం ఉంద‌డ‌ని చెప్పింది. యోగా చేయ‌డం ద్వారానే తాను స్లిమ్‌గా ఉన్నాన‌ని.. త‌న సీక్రెట్‌ను బ‌య‌ట‌పెట్టింది. ప్ర‌తి ఒక్క‌రు యోగా చేయాల‌ని సూచించింది. ప్ర‌తి రోజు ఉద‌యాన్నే సూర్య‌న‌మ‌స్కారం లాంటి చిన్న చిన్న ప్ర‌క్రియ‌ల‌తో యోగాను మొద‌లుపెడితే క్ర‌మంగా అది నిత్య‌జీవితంలో భాగం అవుతుంద‌ని తెలిపింది. ఆ త‌రువాత మ‌రిన్ని యోగాస‌నాలు ప్రాక్టీస్ చేయ‌వ‌చ్చున‌నే స‌ల‌హా కూడా ఇచ్చింది.

Sreeleela : లక్కంటే శ్రీలీలదే.. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ఏకైక హీరోయిన్.. స్వయంగా చంద్రబాబుకు పరిచయం చేసిన బాలయ్య..

“నాకు వర్క‌వుట్స్ చేయ‌డం అంత‌గా ఇష్టం ఉండ‌దు. యోగా కోసం ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తాను. యోగా చేయ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఒక ర‌క‌మైన ఇంజ‌నీరింగ్ ప్ర‌క్రియ జ‌రుగుతుంది. త‌ద్వారా ఎన్నో ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయి. ప్ర‌తి రోజు యోగా చేయ‌డం ద్వారా మ‌న ఆలోచ‌న విధానం, శ‌రీర సౌష్ట‌వం బాగుంటుంది.” అని శ్రీలీల అంది.

ప్ర‌స్తుతం అమ్మ‌డి చేతిలో అర‌డ‌జ‌నుకు పైగా చిత్రాలున్నాయి. పాత్ర‌, నిడివి వంటి వాటి గురించి తాను ఎక్కువ‌గా ఆలోచించ‌న‌ని, త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన అవ‌కాశాల‌కు ఓకే చెబుతాను అని ఓ సంద‌ర్భంలో శ్రీలీల తెలిపింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రో వైపు త‌న చ‌దువును కొన‌సాగిస్తోంది.

Sreeleela : సీనియర్, జూనియర్ హీరోలు ఎవర్నీ వదలట్లేదుగా