Bigg Boss 5 : బ్యూటిఫుల్ యాక్ట్రెస్ శ్వేత వర్మ కన్ఫమ్..!

‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 5’ షో కంటెస్టెంట్ల లిస్టులో ఇప్పుడు కొత్తగా నటి శ్వేత వర్మ పేరు వినిపిస్తోంది..

Bigg Boss 5 : బ్యూటిఫుల్ యాక్ట్రెస్ శ్వేత వర్మ కన్ఫమ్..!

Swetaa Varma

Bigg Boss 5: వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 5’ మొదలైంది. ఈ షో కి సంబంధించి గతకొద్ది రోజులుగా కంటెస్టెంట్ల గురించి వారి పారితోషికాల గురించి పలు వార్తలు వస్తున్నాయి కానీ బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం ఎలాంటి క్లూస్, న్యూస్ బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Aata Sandeep : ‘బిగ్ బాస్-5’ లో డ్యాన్సింగ్ కపుల్..

ఇప్పటికే ఎంపిక చేసిన కంటెస్టెంట్లను ఓ ప్రముఖ స్టార్ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంచారని సమాచారం. తాజాగా కంటెస్టెంట్స్ లిస్టులో కొత్తగా మరో భామ పేరు వినిపిస్తోంది. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ శ్వేత వర్మ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ కాబోతుందని తెలుస్తోంది. సెప్టెంబర్ 5 నుండి ఈ క్రేజీ రియాలిటీ షో స్టార్ మా లో టెలికాస్ట్ అవనుంది.

Navya Swamy : బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చెయ్యడానికి రీజన్ అదే..

‘పచ్చీస్’, ‘మ్యాడ్’, ‘రాణి’ వంటి పలు సినిమాల్లో తన నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక టాలెంటెడ్ యాక్ట్రెస్.. భవిష్యత్తులో మంచి నటి అవుతుంది అని ఇండస్ట్రీ వర్గాల వారి కాంప్లిమెంట్స్ అందుకుంది. రీసెంట్‌గా ‘నెగటివ్’ అనే సైకలాజికల్ థ్రిల్లర్‌లో లీడ్ క్యారెక్టర్ చేసింది. డిఫరెంట్ పాయింట్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ మూవీ త్వరలో ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.

Negative