ఏడాది వరకు నో థియేటర్స్?..

మరికొద్ది రోజులు థియేటర్లకు కష్టాలు తప్పవంటున్న బాలీవుడ్ నటి టిస్కా చోప్రా..

  • Published By: sekhar ,Published On : April 15, 2020 / 03:57 PM IST
ఏడాది వరకు నో థియేటర్స్?..

మరికొద్ది రోజులు థియేటర్లకు కష్టాలు తప్పవంటున్న బాలీవుడ్ నటి టిస్కా చోప్రా..

కరోనా విజృంభిస్తున్న వేళ దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందరికీ ఇవే ప్రస్తుతం కాలక్షేపం. అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌ వంటి పలు యాప్స్ మాంచి ఆఫర్స్‌తో ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కి మంచి టైమ్ నడుస్తోందని అయితే లాక్‌డౌన్ క్రమంగా ఎత్తివేసినా కూడా ఒక సంవత్సరం పాటు ప్రేక్షకులు సినిమా హాళ్లకు రారు అని చెప్తోంది బాలీవుడ్ నటి టిస్కా చోప్రా. ‘‘ఇప్ప‌టికే మంచి కంటెంట్ అంతా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు వెళ్తున్నాయి. రాబోయే రోజుల్లో చిన్న, మ‌ధ్య త‌ర‌హా సినిమాలు కూడా ఈ దారినే ఎంచుకుంటాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అంద‌రూ బ‌య‌ట క‌లిసి తిర‌గ‌డానికి భ‌య‌ప‌డ‌తారు. దీనివ‌ల్ల థియేటర్ల‌ పరిస్థితి దయనీయంగా తయారవుతోంది.

Read Also : పవన్ హీరోయిన్ తల్లి కాబోతుంది!

500 మందితో క‌లిసి త‌లుపులు మూసిన గ‌దిలో ఉండాలని ఎవరూ అనుకోరు కదా. నేను కూడా ఉండాల‌నుకోను. ఎందుకంటే అలాంటిచోట్ల వైర‌స్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ. ఈ పరిస్థితిలో ఎవ‌రూ థియేటర్‌కు రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. నా అంచనా ప్రకారం తక్కువలో తక్కువ ఓ ఏడాదిపాటు జ‌నాల్లో ఇదే అభిప్రాయం ఉండొచ్చు. దీంతో పెద్ద సినిమాలు మ‌రో ఆరునెల‌లు, లేదా ఓ సంవ‌త్స‌రం వ‌ర‌కు ఆల‌స్యంగా విడుదల‌య్యే అవ‌కాశం ఉంది’’ అని తన అభిప్రాయాన్ని తెలిపారు. తెలుగులో రామ్ చరణ్ ‘బ్రూస్‌లీ’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాల్లో నటించింది టిస్కా చోప్రా.