Actress Vanitha Vijaykumar : నాలుగు కాకపోతే 40 పెళ్లిళ్లు చేసుకుంటా….!

కోలీవుడ్‌లో తరచూ వార్తల్లో నిలిచే వివాదస్పద తమిళ నటి వనితా విజయకుమార్ మరోసారి వార్తల్లో కెక్కారు.  తమిళ్ పవర్ స్టార్ శ్రీనివాసన్ ను పెళ్లి చేసుకున్న ఫోటోలు తన ట్విట్టర్ లో  షేర్ చేసి మళ్లీ వార్తల్లో కెక్కారు.

Actress Vanitha Vijaykumar : నాలుగు కాకపోతే 40 పెళ్లిళ్లు చేసుకుంటా….!

Vanitha Vijaykumar

Actress Vanitha Vijaykumar :  కోలీవుడ్‌లో తరచూ వార్తల్లో నిలిచే వివాదస్పద తమిళ నటి వనితా విజయకుమార్ మరోసారి వార్తల్లో కెక్కారు.  తమిళ్ పవర్ స్టార్ శ్రీనివాసన్ ను పెళ్లి చేసుకున్న ఫోటోలు తన ట్విట్టర్ లో  షేర్ చేసి మళ్లీ వార్తల్లో కెక్కారు.

వనిత గతేడాది జూన్ లో పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకుని విమర్శల పాలైంది. వీరి వివాహం సినీ ఇండ్రస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది. అయితే వారి వైవాహిక జీవితం ఎంతో కాలం సజావుగా సాగలేదు. కొద్ది రోజుల క్రితం వాళ్లిద్దరూ విడిపోయారు. అలా మూడో పెళ్లి పెటాకులై పోయిన వనిత మళ్లీ ఒంటరిదయ్యింది.

తాజాగా పవర్ స్టార్ శ్రీనివాస్ తో పెళ్లి ఫోటో షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. శ్రీనివాసన్, వనితా విజయ్ కుమార్ పెళ్లి బట్టలలో మెరిసిపోతుండగా, వీరిద్దరూ వివాహం చేసుకున్నారని అందరూ భావించారు. ఇద్దరూ పూల దండలు మార్చుకుంటున్న ఫోటో షేర్ చేసి దానికి లవ్ సింబల్  కూడా యాడ్ చేసింది. దీంతో వనిత నాలుగో పెళ్లి చేసుకుందని నెటిజన్లు ఆమెపై విరుచుకు పడ్డారు.

వనితకు నాలుగో పెళ్లి జరుగుతుందని గతంలో ఒక జ్యోతిష్యుడు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తుచేశారు. ఇక వీరిద్దరూ పెళ్లి ఫోటో తెగ వైరల్ అవటంతో ప్రతి ఒక్కరూ వనిత పెళ్ళి విషయమై కామెంట్లు చేయటం మొదలెట్టారు. ఈ కామెంట్లు వనిత విజయకుమార్ చెవిన పడ్డాయి.

దీంతో ఆమె ఆఫోటో గురించి స్పందించింది.  ఇది నిజమైన పెళ్ళికాదని.. పికప్ డ్రాప్ అనే చిత్రానికి చెందిన ఫోటో అని వివరణ ఇచ్చింది. తన పెళ్లిపై వచ్చిన కామెంట్ల గురించి మాట్లాడుతూ….. ‘ఇద్దరు నటీనటులు కలిసి ఫోటోలు తీసుకుంటే అది నిజమైన పెళ్లి అయిపోతుందా? దానికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది? నా స్థానంలో ఒక మగవాడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా పట్టించుకోని జనాలు ఆ పని ఒక మహిళ చేస్తే మాత్రం తప్పుపడుతున్నారు. నాలుగు కాదు..40 పెళ్లిళ్లు చేసుకుంటాను. అది నా వ్యక్తిగత విషయం. అయినా నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు’ అని స్పష్టం చేసింది.