Actresses : ఓటీటీలను ఏలుతున్నారు..

సిల్వర్ స్క్రీన్ మీద కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉండగానే.. ఓటీటీల్లో ఫుల్ బిజీ అయిపోతున్నారు మన టాప్ హీరోయిన్స్..

Actresses : ఓటీటీలను ఏలుతున్నారు..

Actresses

Actresses: స్టార్ హీరోయిన్లు ఇప్పుడు స్మాల్ స్క్రీన్ మీద హడావిడి చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉండగానే.. ఓటీటీల్లో ఫుల్ బిజీ అయిపోతున్నారు మన టాప్ హీరోయిన్స్. అసలు హీరోయిన్ల కోసమే వెబ్ సిరీస్‌లు చేస్తూ ఓటీటీ కంటెంట్‌ని మరింత ఎగ్జైటింగ్‌గా మార్చేస్తున్నారు మేకర్స్. మరి వెబ్ సిరీస్‌లతో ఓటీటీలో హీరోలైపోయిన హీరోయిన్స్ ఎవరో చూద్దాం.

జస్ట్ బ్యూటీ కోసమే కాకుండా యాక్టింగ్స్ స్కిల్స్‌తో ఓటీటీల్లో హీరోలుగా సందడి చేస్తున్నారు స్టార్ హీరోయిన్లు. ఓటీటీల్లో హీరోయిన్ల కోసమే ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌తో ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తున్నారు మేకర్స్. స్పెషల్లీ విమెన్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్‌లు, సినిమాలతో మన టాప్ హీరోయిన్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో బిజీగాఉన్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి హీరోయిన్ ఓటీటీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Tamannaah : ‘లెవన్త్ అవర్’.. తమన్నా రెమ్యునరేషన్ ఎంతంటే!..

సమంత, తమన్నా, కాజల్ 10 ఏళ్ల నుంచి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. లాస్ట్ ఇయర్ ‘నవంబర్ స్టోరీస్’ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. లేటెస్ట్‌గా ‘లెవన్త్ అవర్’ అనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌తో ఆడియన్స్‌లో తన మార్క్ చూపించింది. ‘లెవన్త్ అవర్’ లో తమన్నా పవర్‌ఫుల్ ఎంటర్ ప్రెన్యూర్‌గా కనిపించి అదరగొట్టింది.

మరో సౌత్ టాప్ హీరోయిన్ సమంత కూడా వెబ్ సిరీస్‌లతో బిజీగాఉంది. టాలీవుడ్‌లో కాదు.. ఏకంగా బాలీవుడ్‌లో ఓటీటీ ప్రాజెక్ట్స్‌తో బిజీ అయ్యింది సమంత. సూపర్ పాపులర్ అయిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ లో యాక్టింగ్‌తో పాటు యాక్షన్‌తో సత్తా చూపించింది. బాలీవుడ్ బ్యాచ్‌కి సౌత్ స్టామినా చూపించి.. సిరీస్ సక్సెస్‌లో మేజర్ రోల్ ప్లే చేసింది సామ్.

Samantha

మరో టాప్ హీరోయిన్ కాజల్ కూడా ఇటు సినిమాలతో పాటు అటు వెబ్ సిరీస్‌తో బిజీ అయిపోయింది. ‘లైవ్ టెలికాస్ట్’ టైటిల్‌తో ఫిబ్రవరిలో రిలీజ్ అయిన హార్రర్ థ్రిల్లర్‌తో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్. కాజల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఓటీటీ ఆడియన్స్‌ని హార్రర్ థ్రిల్లర్‌తో భయపెట్టింది. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ ‘లైవ్ టెలికాస్ట్’ లో జర్నలిస్ట్ క్యారెక్టర్ చేసింది కాజల్.

Kajal Aggarwal

ఇక సినిమాలతో బిజీగా ఉన్నా కూడా తాప్సీ, రెజీనా, శృతి హాసన్ లాంటి హీరోయిన్లు కూడా ఓటీటీ కంటెంట్‌తో బిజీ అవుతున్నారు. రెజీనా లేటెస్ట్‌గా తెలుగులో ‘అన్యాస్ ట్యుటోరియల్’ అంటూ హార్రర్ థ్రిల్లర్ సిరీస్ చేస్తోంది. తాప్సీ ‘హసీనా దిల్ రుబా’ లాంటి సినిమాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేస్తూ అక్కడ హడావిడి చేస్తోంది. ఇక బోల్డ్ బ్యూటీ శృతి హాసన్ కూడా స్టార్ హీరోలతో సినిమాలు ఉన్నా కూడా ఇంకా ఎక్స్‌ప్లోర్ కావడానికి ‘పిట్టకథలు’ లాంటి వెబ్ సిరీస్‌లతో ఓటీటీలో పవర్ చూపిస్తోంది.

Anyas Tutorial : ‘ఆహా’ లో మరో అద్భుతమైన వెబ్ సిరీస్..

చిన్న హీరోయిన్లే కాదు.. విద్యా బాలన్ లాంటి స్ట్రాంగ్ హీరోయిన్ కూడా ఓటీటీలో తన పవర్ చూపిస్తోంది. ‘శకుంతలా దేవి’ బయోపిక్‌తో ఓటీటీ ఆడియన్స్‌ని పలకరించిన విద్యా బాలన్.. లేటెస్ట్‌గా ‘షేర్నీ’ అంటూ విమెన్ సెంట్రిక్ మూవీతో ఓటీటీలో సత్తా చాటింది. ఇలా కంటెంట్ ఏదైనా, క్యారెక్టర్ ఏదైనా.. ఓటీటీలకు రెడీ అంటున్నారు హీరోయిన్లు. సినిమాల్లో ఉన్నట్టు తమ క్యారెక్టర్‌కి పెద్దగా హద్దులు ఉండవు కాబట్టి.. ఓటీటీ సామ్రాజ్యంలో హీరోయిన్లే హీరోలనడంలో ఏమాత్రం డౌట్ లేదంటున్నారు ఆడియన్స్.

Vidya Balan