The Kerala Story : ది కేరళ స్టోరీ ఏ ఓటీటీలో ప్రసారం కానుంది తెలుసా?

ఎన్నో వివాదాలు మధ్య రిలీజ్ అయ్యి థియేటర్ లో కాసులు వర్షం కురిపిస్తున్న ‘ది కేరళ స్టోరీ’.. ఏ ఓటిటిలో ప్రసారం కానుంది తెలుసా?

The Kerala Story : ది కేరళ స్టోరీ ఏ ఓటీటీలో ప్రసారం కానుంది తెలుసా?

Adah Sharma The Kerala Story ott streaming platform

The Kerala Story : అదా శర్మ (Adah Sharma) మెయిన్ లీడ్ చేస్తూ వచ్చిన సినిమా ‘ది కేరళ స్టోరీ’. వివాదాస్పద కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో విమర్శలు ఎదురుకుంటుంది. పలు చోట్ల ఈ సినిమాని బ్యాన్ కూడా చేస్తున్నారు. విడుదలకి ముందే బెదిరింపులు ఎదురుకున్న చిత్ర యూనిట్ కోర్ట్ కి వెళ్లి మూవీ రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు. అయినా సరి నిరసనలకు బయపడి పలు చోట్ల ఈ సినిమాని రిలీజ్ చేయడం నిలిపేశారు థియేటర్ యాజమాన్యం. ఇక మే 5న చాలా తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మౌత్ టాక్ తో దూసుకుపోతుంది.

Sai Dharam – Manchu Manoj : విరూపాక్ష సక్సెస్.. సాయి ధరమ్‌కి మంచు మనోజ్ బిర్యానీ పార్టీ!

ఇక థియేటర్స్ లో సత్తా చాటుతున్న ఈ చిత్రం ఏ ఓటిటిలో అందుబాటులోకి రాబోతుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ జీ5 లో ప్రసారం కానుంది. ప్రస్తుతం థియేటర్స్ లో ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడంతో ఓటిటి రిలీజ్ ఇప్పటిలో ఉండే అవకాశం లేదు. కాగా ఈ సినిమా ఇప్పటివరకు 56.86 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. సోమా, మంగళ వారాల్లో కూడా ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ ని అందుకుంటుంది. ఈ కలెక్షన్స్ చూస్తుంటే.. ఈ మూవీ 100 కోట్ల మార్క్ ని అందుకుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Celebrities Looks : లైఫ్ మ్యాంగోస్‌తో స్వీట్‌గా ఉంటుంది అంటున్న శ్రీలీల.. షిర్లీ సేఠియా సొగసులు..

సుదీప్తో సేన్‌ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం కేరళలోని (Kerala) అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అనే కథాంశంతో తెరకెక్కింది. ఈ స్టోరీ లైన్ వలనే అనేక విమర్శలకు గురి అయ్యింది. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) అయితే ఈ సినిమాని ఏకంగా బ్యాన్ చేస్తూ ఉత్తర్వూలు జారీ చేశారు.