Adivi Sesh: నెల గ్యాప్‌లో అడవి శేష్ రెండు సినిమాల రిలీజ్.. మహేష్, నానీల సపోర్ట్!

బాహుబలిలో భద్ర క్యారెక్టర్ చేసిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి, మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్న అడవి శేష్. హీరోగా సక్సెస్ కొట్టడానికి తెగ ట్రై చేస్తున్నాడు.

Adivi Sesh: నెల గ్యాప్‌లో అడవి శేష్ రెండు సినిమాల రిలీజ్.. మహేష్, నానీల సపోర్ట్!

Adivi Sesh

Adivi Sesh: బాహుబలిలో భద్ర క్యారెక్టర్ చేసిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి, మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్న అడవి శేష్. హీరోగా సక్సెస్ కొట్టడానికి తెగ ట్రై చేస్తున్నాడు. మేజర్ సినిమా చేసిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. కాని, ఇప్పుడు నెల గ్యాప్ లోనే రెండు సినిమాలతో తన లక్ పరీక్షించుకోబోతున్నాడు. రిలీజ్ కు రెడీ అయిన అడవి శేష్ సినిమాల డిటైల్స్ పై ఓ లుక్కేద్దాం.

Adivi Sesh: సెకండ్ కేస్‌ను పట్టుకొస్తున్న అడివిశేష్.. ఎప్పుడంటే?

శైలేష్ కోనేరు డైరెక్షన్ లో హిట్ సీక్వెల్ హీరోగా ఈ సారి అడవి శేష్ నటించాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేసింది. నాచురల్ స్టార్ నాని సమర్పించిన హిట్ 2 సినిమాను జులై 29న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఆల్రెడీ అడవి శేష్ హీరోగా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా మహేశ్ బాబు నిర్మించిన మేజర్ సినిమా జూన్ 3న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇప్పుడు హిట్ 2 కూడా రిలీజ్ కు రెడీ అవడంతో అడవి శేష్ హీరోగా నెల గ్యాప్ లోనే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Adivi Sesh: ‘మేజర్’ అప్‌డేట్ ఇచ్చిన హీరో!

చిన్న చిన్న క్యారెక్టర్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన అడవి శేష్.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముంబై ఉగ్ర దాడుల్లో భళైన మేజర్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా మేజర్ సినిమా చేసిన శేష్ కు రిలీజ్ గంఢం పట్టుకుందనే చెప్పాలి. మేజర్ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నప్పటికీ రకరకాల రీజన్స్ తో రిలీజ్ బాగా ఢిలే అయ్యింది.

Adivi Sesh : ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అడివి శేష్..

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన అడవి శేష్ కు మేజర్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. దాంతో హిట్ 2 పట్టాలెక్కించిన శేష్.. అటు మేజర్, ఇటు హిట్ 2 రెండు సినిమాలతో వన్ మంత్ గ్యాప్ లోనే ఆడియన్స్ ముందుకు వచ్చి హీరోగా తన లక్ పరీక్షించుకోబోతున్నాడు. దాంతో అటు నాని ఫ్యాన్స్, ఇటు మహేశ్ ఫ్యాన్స్ అడవి శేష్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.