Bheemla Nayak సాంగ్ వచ్చేసింది.. సెప్తున్నా నీ మంచి సెడ్డా.. ఆన్తోటి పంతాలు పోవాకు బిడ్డా..!!

పవన్ కళ్యాణ్ హీరోగా.. రానా ప్రధాన పాత్రలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'భీమ్లా నాయక్'

Bheemla Nayak సాంగ్ వచ్చేసింది.. సెప్తున్నా నీ మంచి సెడ్డా.. ఆన్తోటి పంతాలు పోవాకు బిడ్డా..!!

Bheemla

Bheemla Nayak Song: పవన్ కళ్యాణ్ హీరోగా.. రానా ప్రధాన పాత్రలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘భీమ్లా నాయక్’. ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ నిర్మించగా.. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ అనే మలయాళ సినిమాని రీమేక్ చేస్తున్నారు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తోండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా నుంచి అడవి తల్లి మాట అనే సాంగ్‌ను లేటెస్ట్‌గా విడుదల చేసింది చిత్రయూనిట్.. ‘భీమ్లా నాయక్’ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. సెప్తున్నా నీ మంచి సెడ్డా.. ఆన్తోటి పంతాలు పోవాకు బిడ్డా అంటూ అడవి తల్లి చెబుతున్నట్లుగా సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదలవ్వగా.. నాల్గొవ పాటను ఇప్పుడు విడుదల చేశారు. సిరివెన్నెల మృతికి సంతాపం తెలుపుతూ ఈ సాంగ్ స్టార్ట్ అయ్యింది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.