జెర్సీ ఫస్ట్ సాంగ్ విన్నారా?

జెర్సీ ఫస్ట్ సాంగ్ రిలీజ్.

  • Edited By: sekhar , February 15, 2019 / 05:28 AM IST
జెర్సీ ఫస్ట్ సాంగ్ విన్నారా?

జెర్సీ ఫస్ట్ సాంగ్ రిలీజ్.

 నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాధ్, రెబా మోనికా జాన్ హీరో, హీరోయిన్స్‌గా, మళ్ళీ రావా ఫేమ్.. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందుతున్న పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా.. జెర్సీ.. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. జెర్సీ ఫస్ట్‌లుక్, టీజర్‌కీ చక్కటి స్పందన వస్తుంది. ఫిబ్రవరి 14 న, లవర్స్ డే స్పెషల్‌గా జెర్సీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్.. అదేంటోగానీ ఉన్నపాటుగా, అమ్మాయి ముక్కు మీద నేరుగా, తరాలనాటి కోపమంతా ఎరుపేగా.. అంటూ సాగే ఈ పాటకి కృష్ణకాంత్ (కె.కె.) లిరిక్స్ రాసాడు.

అనిరుధ్ రవిచందర్ ట్యూన్ కంపోజ్ చేసి, చక్కగా పాడాడు.. యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుందీ సాంగ్.. ఏప్రిల్‌లో జెర్సీ రిలీజ్ కానుంది.
ఈ సినిమాకి మ్యూజిక్ : అనిరుధ్, కెమెరా : సాను జాన్ వర్గీస్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : అవినాష్ కొల్లా, లిరిక్స్ : కృష్ణకాంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్.వెంకటరత్నం (వెంకట్).

వాచ్ జెర్సీ లిరికల్ సాంగ్…