Adipurush: మళ్లీ డైలమాలో ఆదిపురుష్ ఫ్యాన్స్.. ఎందుకంటే..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ తెరకెక్కించగా, ఈ సినిమాను హిస్టారికల్ సబ్జెక్ట్‌తో చిత్ర యూనిట్ రూపొందించింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించింది.

Adipurush: మళ్లీ డైలమాలో ఆదిపురుష్ ఫ్యాన్స్.. ఎందుకంటే..?

Adipurush Fans Again In Dilemma Over Teaser

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ తెరకెక్కించగా, ఈ సినిమాను హిస్టారికల్ సబ్జెక్ట్‌తో చిత్ర యూనిట్ రూపొందించింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కించగా, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Prabhas: ఆదిపురుష్ నుంచి అప్డేట్ అప్పుడేనా.. క్లారిటీ ఇచ్చిన ఓమ్ రౌత్!

అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించింది. దీంతో ఈ టీజర్‌ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. కాగా, దసరా కానుకగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తారని చిత్ర వర్గాల్లో వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమా నుండి దసరాకు వస్తుందని చూస్తున్న టీజర్ పండగకు వచ్చేలా లేదని తెలుస్తోంది.

Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్

ఇటీవల ప్రభాస్ ఇంట విషాదం చోటుచోసుకోవడంతో ఆదిపురుష్ టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదిపురుష్ చిత్రం నుండి దసరాకు రావాల్సిన టీజర్‌ను ఇప్పట్లో రిలీజ్ చేసేలా కనిపించడం లేదట. దీంతో ప్రభాస్ అభిమానులు మరోసారి డైలమాలో పడిపోయారు. ఆదిపురుష్ నుండి అప్డేట్ వస్తుందని ఎదురుచూసిన తమకు మరోసారి నిరాశే మిగలనుందా అని వారు ప్రశ్నిస్తున్నారు. మరి నిజంగానే ఆదిపురుష్ నుండి రావాల్సిన ట్రీట్ వాయిదా పడిందా అనే విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.