Adipurush : హడావిడి లేకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు..

‘ఆదిపురుష్’ థర్డ్ షెడ్యూల్ శనివారం(జూలై 3) నుండి బాంబేలో జరుగుతోంది.. త్వరలో ప్రభాస్ షూట్‌లో జాయిన్ అవనున్నారని టీం తెలిపారు..

Adipurush : హడావిడి లేకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు..

Adipurush Movie 3rd Schedule Begins

Adipurush: రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ హీరోగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆదిపురుష్’.. ఆదిలోనే హంసపాదు అన్నట్లు సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన కాసేపటికే ఫైర్ యాక్సిడెంట్‌లో సెట్ ప్రమాదానికి గురైంది. తర్వాత ‘ఆదిపురుష్’ ప్రాజెక్ట్‌కి సంబంధించి అప్‌డేట్స్ ఆగిపోయాయి.

Adipurush : ‘ఆదిపురుష్’ ఫ్యాన్ మేడ్ ఫస్ట్ లుక్..!

కట్ చేస్తే ఈ సినిమా షూటింగ్ అప్పుడే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయిపోవడమే కాక ఇప్పుడు ముచ్చటగా మూడో షెడ్యూల్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్న సంగతి తెలిసిందే.

Adipurush : షూటింగ్ లేట్ అయినా ‘ఆదిపురుష్’ చెప్పిన డేట్‌కే వస్తాడు.. గ్రాఫిక్స్ కోసం 100 కోట్లకు పైనే..

హై టెక్నికల్ వాల్యూస్‌, మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీతో అత్యంత భారీగా రూపొందుతున్న ‘ఆదిపురుష్’ థర్డ్ షెడ్యూల్ శనివారం(జూలై 3) నుండి బాంబేలో జరుగుతోంది. త్వరలో ప్రభాస్ షూట్‌లో జాయిన్ అవనున్నారని టీం తెలిపారు. టీ సిరీస్‌ బ్యానర్‌ మీద భూషణ్‌ కుమార్‌, కృష్ణ కుమార్‌లతో పాటు ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ అనౌన్స్ చేశారు.