ప్రభాస్ ‘ఆదిపురుష్’ అవతార్..

ప్రభాస్ ‘ఆదిపురుష్’ అవతార్..

Adipurush: ‘బాహుబలి’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రెబల్‌స్టార్ ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్టులు అంగీకరిస్తున్నారు. ‘రాధే శ్యామ్’ రిలీజ్‌కి రెడీ అవుతుండగా.. ఇటీవలే ‘సలార్’ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. నాగ్ అశ్విన్‌తో చేస్తున్న మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్.. రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమా ప్రకటించినప్పటి నుండి రాముడిగా ప్రభాస్ ఇలా ఉంటాడు అంటూ పలు ఫ్యాన్ మేడ్ పోస్టర్లు దర్శనమిచ్చాయి.

Adipurush

తాజాగా ఓ అభిమాని డిజైన్ చేసిన ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది. నుదుటిన తిలకం, పొడవాటి జుట్టు, గెడ్డంతో డార్లింగ్ పోస్టర్ అదిరింది అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు. ‘ఆదిపురుష్’ ని ఫిబ్రవరి 2న లాంఛనంగా ప్రారంభించనున్నారు.

టీ సిరీస్‌ బ్యానర్‌ భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌లతో పాటు ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ ప్రకటించారు.

Adipurush