Adipurush : ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. సభ డిజైన్ అదరగొట్టేశారుగా.. కిష్కింధ, మిథిల, అయోధ్య.. గ్రౌండ్ మ్యాప్ వైరల్

SV యూనివర్సిటీ గ్రౌండ్ ని ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సినిమాను మొదటి నుంచి కూడా జై శ్రీరామ్ అంటూ ఆధ్యాత్మికంగానే ప్రమోట్ చేస్తున్నారు. దీంతో సభ నిర్వహణ కూడా ఆధ్యాత్మికంగా కొత్తగా డిజైన్ చేశారు.

Adipurush : ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. సభ డిజైన్ అదరగొట్టేశారుగా.. కిష్కింధ, మిథిల, అయోధ్య.. గ్రౌండ్ మ్యాప్ వైరల్

Adipurush Pre Release Event Ground Map goes viral specially designed Ground like Ramayana

Adipurush Pre Release event :  ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ఆదిపురుష్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

నేడు జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి (Tirupati) శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భారీగా నిర్వహించబోతున్నారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అయితే ఈ ఈవెంట్ లో చాలా స్పెషల్స్ ఉన్నాయి. ఎన్నడూ జరగని విధంగా భారీగా, ప్రత్యేకంగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ చేస్తుండటంతో మరింత ఆసక్తికరంగా మారింది.

SV యూనివర్సిటీ గ్రౌండ్ ని ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సినిమాను మొదటి నుంచి కూడా జై శ్రీరామ్ అంటూ ఆధ్యాత్మికంగానే ప్రమోట్ చేస్తున్నారు. దీంతో సభ నిర్వహణ కూడా ఆధ్యాత్మికంగా కొత్తగా డిజైన్ చేశారు. ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్న శ్రేయాస్ మీడియా తాజాగా సభ మ్యాపింగ్ ప్లాన్ ని రిలీజ్ చేసింది. ఇది చూసి అభిమానులు, ప్రేక్షకులు, నెటిజన్లు అంతా ఆశ్చర్యపోతూనే అభినందిస్తున్నారు.

Adipurush : ఆదిపురుష్ ఆడే ప్రతి థియేటర్లో ఒక సీటు ఆంజనేయస్వామికి కేటాయింపు.. ఆదిపురుష్ టీం వినూత్న ప్రయోగం..

సభని దీర్ఘ వృత్తాకారంలో డిజైన్ చేశారు. ఇందులో నాలుగు భాగాలుగా డివైడ్ చేసి సభకు అయిదు ఎంట్రీలు ఇచ్చారు. నాలుగు భాగాలకు రామాయణంలోని రాజ్యాల పేర్లు పెట్టారు. ముందు కిష్కింధ, ఆ తర్వాత పంచవటి, ఆ తర్వాత మిథిల, చివరగా స్టేజి దగ్గర అయోధ్య భాగాలను ఏర్పాటు చేశారు. అయోధ్య భాగంలో సెలబ్రిటీలు, గెస్టులు కూర్చుంటారు. మిథిల భాగంలో లేడీస్ కి ప్రత్యేకంగా సీటింగ్ ఇచ్చారు. ఇక పంచవటిలో పాస్ లు ఉన్న ఫ్యాన్స్ కి సీటింగ్ ఇచ్చారు. కిష్కింధలో మిగిలిన ఆడియన్స్ కి సీటింగ్ ఇచ్చారు. ఇలా సరికొత్తగా డిజైన్ చేసి, వాటికి పేర్లు పెట్టి, వాటికి తగ్గట్టు సీటింగ్ ఇచ్చి చాలా పద్దతిగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తుండటంతో అందరూ ఆశ్చర్యపోతూనే చిత్రయూనిట్ ని అభినందిస్తున్నారు. ఇక ఆదిపురుష్ ఈవెంట్ గ్రౌండ్ మ్యాప్ షేర్ చేయడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.