Adire Abhi : ఢీ చైతన్య మాస్టర్ పై అదిరే అభి సంచలన వ్యాఖ్యలు.. మాకేం ఎక్కువ అమౌంట్ ఇవ్వట్లేదు.. జబర్దస్త్ వర్సెస్ ఢీ

తాజాగా చైతన్య మరణంపై, అతను వీడియోలో మాట్లాడిన వ్యాఖ్యలపై జబర్దస్త్ అదిరే అభి కామెంట్స్ చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో ముందుగా చైతన్య మాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపాడు. అనంతరం చైతన్య మాస్టర్ జబర్దస్త్ లో ఎక్కువ ఇస్తున్నారు, ఢీలో తక్కువ అమౌంట్ ఇస్తున్నారు అని చేసిన వ్యాఖ్యలపై మాట్లాడారు.

Adire Abhi : ఢీ చైతన్య మాస్టర్ పై అదిరే అభి సంచలన వ్యాఖ్యలు.. మాకేం ఎక్కువ అమౌంట్ ఇవ్వట్లేదు.. జబర్దస్త్ వర్సెస్ ఢీ

Adire Abhi sensational comments on Chaitanya Master along with Jabardasth and Dhee

Adire Abhi :  ప్రముఖ డ్యాన్స్(Dance) షో ఢీలో(Dhee) కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. నెల్లూరులో ఓ ఈవెంట్ కు వెళ్లి అక్కడే తాను ఉన్న రూమ్ లో ఆత్మహత్య చేసుకొని మరణించారు. చైతన్య(Chaitanya) మాస్టర్ ఆత్మహత్య చేసుకునే ముందు ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో అప్పుల బాధల వల్లే, ఆ అప్పులు తీర్చేలేకే, ఒత్తిడి ఎక్కువయ్యే చనిపోతున్నాను అని, అలాగే ఢీ కంటే కూడా జబర్దస్త్(Jabardasth) లో ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని, మాకు తక్కువ అమౌంట్ ఇస్తున్నారని ఆ వీడియోలో తెలిపాడు చైతన్య మాస్టర్.

సోమవారం నాడు చైతన్య మాస్టర్ అంత్యక్రియలు నెల్లూరు దగ్గర ఆయన సొంతగ్రామంలో జరిగాయి. ఈ అంత్యక్రియలకు ఢీ డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లు చాలా మంది వచ్చారు. పలువురు డ్యాన్సర్లు మీడియాతో మాట్లాడుతూ చైతన్య మాస్టర్ తో తమకు ఉన్న బంధం గురించి తెలిపారు. అనంతరం పలువురు టీవీ ప్రముఖులు చైతన్య మరణంపై స్పందిస్తున్నారు. చైతన్య వీడియోలో మాట్లాడిన వ్యాఖ్యలపై కూడా స్పందిస్తున్నారు.

తాజాగా చైతన్య మరణంపై, అతను వీడియోలో మాట్లాడిన వ్యాఖ్యలపై జబర్దస్త్ అదిరే అభి కామెంట్స్ చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో ముందుగా చైతన్య మాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపాడు. అనంతరం చైతన్య మాస్టర్ జబర్దస్త్ లో ఎక్కువ ఇస్తున్నారు, ఢీలో తక్కువ అమౌంట్ ఇస్తున్నారు అని చేసిన వ్యాఖ్యలపై మాట్లాడారు. అభి మాట్లాడుతూ.. టీవీ షోలలో వచ్చే రేటింగ్ ని బట్టి అమౌంట్ ఇస్తారు. ఒకప్పుడు జబర్దస్త్ కి బాగా రేటింగ్ వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అలాగే ఒక సిగ్మెంట్ కి అది స్కిట్ అయినా, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయినా సరే ఒక టీంకి ఇంత మనీ అని ఇస్తారు. అందులోనే మనం ఆ పర్ఫార్మెన్స్ ని మంచిగా చేయగలగాలి. అది మన ట్యాలెంట్ బట్టి ఉంటుంది. మనం ఎక్కువ ఖర్చుపెడితే మనదే తప్పు అని అన్నాడు.

Chaitanya Master : ఢీ చైతన్య మాస్టర్ అప్పుల వల్ల కాదా ఆత్మహత్య చేసుకుంది? రాజు మాస్టర్ సంచలన వ్యాఖ్యలు..

అలాగే.. మేము జబర్దస్త్ నుంచి మాత్రమే సంపాదించలేదు. బయట ఈవెంట్స్ చేసుకొని సంపాదించుకుంటాం. మాకు కూడా జబర్దస్త్ లో ఇచ్చేది తక్కువే. మాకు ఇచ్చే అమౌంట్ లోనే టీంని మెయింటైన్ చేస్తున్నాం. దాని మీద వచ్చిన డబ్బులతో మేము ఇళ్లు, కార్లు కొనుక్కోలేదు. ఇక్కడ వచ్చిన ఫేమ్ తో బయట ఈవెంట్స్, ఓపెనింగ్స్ చేసి సంపాదించుకొని వాటితోనే ఇల్లులు, కార్లు కొనుక్కుంటున్నాం. జబర్దస్త్ లో ఎక్కువ ఇస్తున్నారు అనేది కరెక్ట్ కాదు. అందరికి ఒకేలా ఇస్తారు. మొదటి నుంచి కూడా నిర్మాణ సంస్థ మల్లెమాల మాకు చెప్తుంది. ఇదొక్కటే మీ ఆదాయంగా పెట్టుకోకండి. ఇక్కడ చేసుకుంటూనే బయట వేరే పనులు కూడా చేసుకోండి, ఈవెంట్స్ చేసుకోండి అని చెప్తున్నారు. జబర్దస్త్ మాకు ఒక సపోర్ట్ మాత్రమే. మాకు ఎంత అమౌంట్ ఇస్తారు అని ముందే చెప్తారు. దాన్ని కరెక్ట్ గా వాడకపోతే అది మనది తప్పు. అలాగే ఫేమ్ వచ్చాక కొంతమంది ఖరీదైన ఫోన్లు, కార్లు ముందే అప్పులు చేసి కొనేసుకుంటున్నారు. ఆ తర్వాత EMI లు కట్టుకోవచ్చులే అనుకుంటున్నారు. దాని వల్ల కూడా చాలా మంది నష్టపోతున్నారు. ముందు డబ్బులు ఆదా చేసుకోండి ఆ తర్వాతే ఏదైనా కొనుక్కోండి అని అన్నాడు.

Chaitanya : ఢీ డాన్స్ మాస్టర్ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియోలో జబర్దస్త్ షో పై..

ఇక ఇండస్ట్రీకి రాబోయే ఆర్టిస్టులకి కూడా సలహా ఇస్తూ.. ఇక్కడ కష్టాలే ఉంటాయి. ఎన్నో ఏళ్ళు కష్టపడితే ఈ పొజిషన్ లో ఉన్నాం మేము. ఒక్కోసారి తిండి కూడా దొరకదు. ఇండస్ట్రీకి రావాలనుకుంటే ఇలాంటి వాటన్నిటికీ ఫిక్స్ అయి రండి. అంతే కానీ ఇక్కడికి వచ్చి సక్సెస్ అవ్వలేదు, డబ్బులు రాలేదు అంటూ బాధపడకండి అని తెలిపాడు అదిరే అభి. దీంతో ఇప్పుడు అభి చేసిన వ్యాఖ్యలు టీవీ పరిశ్రమలో వైరల్ గా మారాయి. చైతన్య మాస్టర్ మరణంతో జబర్దస్త్ వర్సెస్ ఢీ అని రెమ్యునరేషన్స్ పై, సౌకర్యాలపై టీవీ పరిశ్రమలో వార్ జరుగుతుందని సమాచారం.