Mahesh Babu : మహేశ్ కార్ డ్రైవింగ్.. వెనకపడ్డ పోలీసులు.. మహేశ్‌లో ఆ టాలెంట్ ఉందా? మహేశ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన బాబాయ్..

కృష్ణ(Krishna) తమ్ముడు ఆదిశేషగిరిరావు పద్మాలయ బ్యానర్ పై అనేక సినిమాలు నిర్మించారు. ఇది కృష్ణ సొంత బ్యానర్. ఈ బ్యానర్ లో మహేశ్ బాబు ఒకే ఒక్క సినిమా 'వంశీ'(Vamsi) చేశారు. నిర్మాత ఆదిశేషగిరి రావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు(Mahesh Babu) గురించి పలు ఆసక్తికర విషయాలను తెలియచేశారు.

Adiseshagiri Rao :  మహేశ్ బాబాయ్, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరి రావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు(Mahesh Babu) గురించి పలు ఆసక్తికర విషయాలను తెలియచేశారు. కృష్ణ(Krishna) తమ్ముడు ఆదిశేషగిరిరావు పద్మాలయ బ్యానర్ పై అనేక సినిమాలు నిర్మించారు. ఇది కృష్ణ సొంత బ్యానర్. ఈ బ్యానర్ లో మహేశ్ బాబు ఒకే ఒక్క సినిమా ‘వంశీ'(Vamsi) చేశారు. మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్(Namrata Shirodkar) కలిసి నటించిన సినిమా వంశీ.

ఆదిశేషగిరి రావు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వంశీ సినిమాలో హీరోయిన్ ని నేనే ఫైనల్ చేశాను. ఆ సినిమా వల్లే నమ్రత, మహేశ్ కలిశారని, వాళ్ళు ప్ర్రేమించుకున్నారని అందరూ నన్ను అంటారు. మహేశ్ మొదట ఈ విషయాన్ని వాళ్ళ అమ్మ ఇందిరాకు చెప్పారు. ఆవిడ అన్నయ్య కృష్ణ గారికి చెప్తే ఓకే అన్నారు. అందరూ ఒప్పుకున్నాకే మహేశ్, నమ్రత పెళ్లి జరిగింది అని తెలిపారు.

ఇక మహేశ్ బాబు చిన్ననాటి సంఘటన ఒకటి షేర్ చేస్తూ.. మేము చెన్నైలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. మహేశ్ చాలా చిన్న వయసులోనే కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఓ సారి 14 ఏళ్లకే మహేశ్ బాబు కారు తీసుకొని రోడ్డ్డు మీద డ్రైవింగ్ కి వెళ్ళిపోయాడు. చెన్నైలో పోలీసులు ఇది చూసి చిన్నపిల్లాడు కార్ నడుపుతున్నాడని గమనించి మహేశ్ కారుని వెంబడించారు. మహేశ్ డైరెక్ట్ గా నా ఆఫీస్ కి కార్ తీసుకొచ్చి పార్కింగ్ చేసి లోపలికి వచ్చి నా వెనక నించున్నాడు. మహేశ్ వెనక వచ్చిన పోలీసులు జరిగింది చెప్పడంతో నేనే పోలీసులకు సర్దిచెప్పి పంపించేశాను. ఇలాంటి అల్లరి పనులు మహేశ్ చిన్నప్పుడు చాలానే చేశాడు అని అన్నారు.

Virupaksha : విరూపాక్ష సినిమాలో మొదట విలన్ గా అనుకుంది ఆమెను కాదట.. కానీ సుకుమార్..

అలాగే మహేశ్ చాలా మంచి మిమిక్రి ఆర్టిస్ట్, ఎవ్వరి వాయిస్ అయినా ఇట్టే చేసేస్తాడు అని అన్నారు. ఈ విషయం తెలిసి ఇప్పుడు అంతా ఆశ్చర్యపోతున్నారు. దీంతో నిర్మాత ఆదిశేషగిరిరావు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వగా మహేశ్ లో ఈ టాలెంట్ ఉందా? ఎప్పుడు బయటపెట్టలేదు అని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు