Aditi Rao Hydari : లగ్జరీ కారు కొన్న అదితి.. ధర ఎంతో తెలుసా??

తెలుగులో సమ్మోహనం సినిమాతో పలకరించి వి, మహా సముద్రం సినిమాలతో ప్రేక్షకులని అలరించిన అదితి రావు హైదరి తాజాగా............

Aditi Rao Hydari : లగ్జరీ కారు కొన్న అదితి.. ధర ఎంతో తెలుసా??

Aditieao

Aditi Rao Hydari :  మలయాళంలో ప్రజాపతి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అదితిరావు హైదరి తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా బిజీ అయిపోయింది. తెలుగులో సమ్మోహనం సినిమాతో పలకరించి వి, మహా సముద్రం సినిమాలతో ప్రేక్షకులని అలరించింది. ప్రస్తుతం హిందీ సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో దూసుకుపోతుంది. తాజాగా అదితి రావు హైదరి ఓ ఖరీదైన కారుని కొనుగోలు చేసింది.

Jai Bheem : సూర్య, జ్యోతికలకు షాకిచ్చిన చెన్నై కోర్టు..

ఇటీవల ముంబైలో అదితి లగ్జరీ కార్లని తయారు చేసే ఆడి కంపెనీకి చెందిన ‘ఆడి క్యూ 7’ కారును కొనుక్కుంది. ఈ కారు విలువ దాదాపు రూ.90 లక్షలు ఉంటుందని సమాచారం. అదితిరావు ఈ కారుని కొనుగోలు చేసినట్లు ఆడి కంపెనీ తన సోషల్​ మీడియాలో పలు ఫోటోలని పోస్ట్ చేసి తెలిపింది. దీంతో అదితి రావు కారుతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంత భారీ ధర పెట్టి అదితి కారు కొందని కొంతమంది ఆశ్చర్యపోతుంటే మరి కొంతమంది కంగ్రాట్స్ తెలుపుతున్నారు.