Siddharth – Aditi : సిద్దార్థ్‌కి అదితి బర్త్ డే విషెస్.. వైరల్ అవుతున్న ఇన్‌స్టా రీల్!

సిద్దార్థ్ పుట్టిన రోజు కావడంతో అదితి ఒక స్పెషల్ రీల్ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో సిద్దార్థ్ అండ్ అదితి ఫారిన్ విధుల్లో..

Siddharth – Aditi : సిద్దార్థ్‌కి అదితి బర్త్ డే విషెస్.. వైరల్ అవుతున్న ఇన్‌స్టా రీల్!

Aditi Rao Hydari special post on Siddharth Birthday

Siddharth – Aditi : సిద్దార్థ్, అదితి రావు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అనుకుంటా. సోషల్ మీడియా, పార్టీస్, ఫంక్షన్స్, ముంబై విధుల్లో ఇద్దరు చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ తెగ సందడి చేస్తున్నారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ప్రేమ గురించి సిద్దార్థ్ అండ్ అదితి మాత్రం సరైన జవాబు చెప్పడం లేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అదితిని దీని గురించి ప్రశ్నించగా.. జనాలు వాళ్లకి ఏది వినాలని కోరుకుంటారో, దాని గురించే మాట్లాడుకుంటారు. మనం వాళ్ళని ఆపలేము అంటూ చెప్పుకొచ్చింది.

Siddharth – Aditi : సిద్దార్థ్‌తో ప్రేమ గురించి స్పందించిన అదితి రావు..

ఇక ఇటీవల ఇన్‌స్టా రీల్స్ కూడా చేస్తూ సందడి చేస్తున్న ఈ జంట.. తాజాగా సిద్దార్థ్ పుట్టిన రోజు కావడంతో అదితి ఒక రీల్ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో సిద్దార్థ్ అండ్ అదితి ఫారిన్ విధుల్లో సరదాగా గంతులు వేస్తూ పరుగులు పెడుతున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. అలాగే సిద్దార్థ్ కి బర్త్ డే విషెస్ చెబుతూ అదితి ఇలా రాసుకొచ్చింది.. “హ్యాపీ బర్త్ డే మానికార్న్. ఎప్పుడు సంతోషంగా ఉంటావు, ప్రేమని పంచుతుంటావు, మంచి హృదయంతో స్ట్రాంగ్ గా ఉంటావు. ఎన్నో నవ్వులను తీసుకు వస్తావు. అసలు ఎదగకుండా ఎప్పటికి యవ్వనంగానే ఉంటావు. ఎప్పటికి ఇలాగే ఉండు. హ్యాపీ సిద్దు డే” అంటూ చెప్పుకొచ్చింది.

Chatrapathi Remake : ఎట్టకేలకు సప్నని పరిచయం చేసిన ఛత్రపతి..

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా వీరిద్దరు కలిసి తెలుగు సినిమా మహాసముద్రంలో నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. వీరిద్దరికి విడివిడిగా ఆల్రెడీ పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు కలిసి డేటింగ్ ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ స్నేహం పెళ్లి వరకు చేరుతుందా? లేదా? చూడాలి.