Siddharth – Aditi : సిద్దార్థ్‌తో ప్రేమ గురించి స్పందించిన అదితి రావు..

గత కొంత కాలంగా సిద్దార్ద్ అండ్ అదితి డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలు పై అదితి స్పందించింది.

Siddharth – Aditi : సిద్దార్థ్‌తో ప్రేమ గురించి స్పందించిన అదితి రావు..

Aditi Rao reacts about love with Siddharth

Siddharth – Aditi : శర్వానంద్, సిద్దార్థ్ కలిసి నటించిన మహాసముద్రం సినిమాలో అదితి రావు హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో సిద్దార్థ్ – అదితి మధ్య స్నేహం ఏర్పడింది అని, అది కాస్త ప్రేమగా మారింది అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో వీరిద్దరూ ఎక్కడ చూసిన జంటగా కనిపిస్తుండడంతో, సిద్దార్థ్ – అదితి డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలు మొదలయ్యి. అయితే ఈ వార్తలు పై ఇప్పటి వరకు సిద్దార్ద్ అండ్ అదితి ఎక్కడ నోరు విప్పలేదు.

Siddharth – Aditi : ముంబై వీధుల్లో ప్రేమ జంట.. సిద్దార్ద్, అదితి రావు!

తాజాగా అదితి ఈ విషయం పై స్పందించింది. ప్రస్తుతం అదితి హిందీలో మూడు వెబ్ సిరీస్ లో నటిస్తుంది. వాటిలో ఒకటి ‘తాజ్’. మార్చి 3 నుంచి ఈ సిరీస్ జీ-5 లో ప్రసారం అవుతుంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సిద్దార్థ్ తో ప్రేమ అంటూ వస్తున్న రూమర్స్ గురించి ప్రశ్నించగా, అదితి బదులిస్తూ.. ”జనాలు వాళ్లకి ఏది కావాలని అనుకుంటారో, దాని గురించే మాట్లాడుకుంటారు. వారిని మనం ఆపలేము కదా. కాబట్టి నాకు ఏది కావాలో నేను దానినే వెతుకుతూ వెళ్తాను. నా వరకు నాకు అంతా ఓకే. చూసే ఆడియన్స్ నన్ను ఎంతవరకు ఆదరిస్తారో అప్పటి వరకు నటిస్తూనే ఉంటా” అంటూ చెప్పుకొచ్చింది.

ఇక ఈ మాటలు విన్న ప్రేక్షకులకు.. అదితి, సిద్దార్ద్‌తో ప్రేమ కన్‌ఫార్మ్ చేసిందా? లేక లైట్ తీసుకుందా? అనేది అర్ధం కాలేదు. కాగా ఇటీవల శర్వానంద్ ఎంగేజ్మెంట్ వేడుకకు కూడా అదితి, సిద్దార్ద్ కలిసి జంటగా వచ్చారు. ముంబై వీధుల్లో కూడా చెట్టపట్టాలు ఏసుకొని తిరుగుతున్న ఈ జంట.. తాజాగా ట్రెండ్ అవుతున్న ‘తుమ్ తుమ్’ సాంగ్ కి కలిసి స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది కాస్త బాగా వైరల్ అయ్యింది.