Aditirao Hydari : అదితి వల్లే నాకు ప్రేమపై విరక్తి కలిగింది.. అదితిరావు హైదరి మాజీ భర్త వ్యాఖ్యలు..

తాజాగా అదితిరావు హైదరి మాజీ భర్త ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదితి గతంలో బాలీవుడ్‌ నటుడు సత్యదీప్‌ మిశ్రాను వివాహం చేసుకుంది. 2009లో వీరిద్దరూ వివాహం చేసుకోగా 2013లో మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అప్పట్నుంచి................

Aditirao Hydari : అదితి వల్లే నాకు ప్రేమపై విరక్తి కలిగింది.. అదితిరావు హైదరి మాజీ భర్త వ్యాఖ్యలు..

Aditirao Hydari ex husband satyadeep mishra sensational comments on Aditi

Aditirao Hydari :  సమ్మోహనం సినిమాతో తెలుగు వాళ్లకి బాగా దగ్గరైంది హీరోయిన్ అదితిరావు హైదరి. ఆ తర్వాత కూడా పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇటీవల గత కొన్ని నెలలుగా అదితి హీరో సిద్దార్థ్ తో రిలేషన్ లో ఉందంటూ వార్తలు వస్తున్నా ఈ వార్తలపై వీరిద్దరూ స్పందించలేదు. కానీ ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసి వెళ్తున్నారు, జంటగా తిరుగుతున్నారు, ఇక ముంబైలో అయితే మీడియా కంట జంటగా చాలా సార్లు కనపడ్డారు. దీంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

తాజాగా అదితిరావు హైదరి మాజీ భర్త ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదితి గతంలో బాలీవుడ్‌ నటుడు సత్యదీప్‌ మిశ్రాను వివాహం చేసుకుంది. 2009లో వీరిద్దరూ వివాహం చేసుకోగా 2013లో మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అప్పట్నుంచి వీరిద్దరూ మళ్ళీ కలవలేదు. ఆ తర్వాత సత్యదీప్‌ మిశ్రా బాలీవుడ్‌ ఫేమస్ ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తాను రెండో పెళ్లి చేసుకున్నాడు.

Samantha : 8 నెలలుగా చాలా ఇబ్బంది పడ్డా.. ఇంకా ధైర్యంగా ముందుకి వెళ్తా.. సమంత ఎమోషనల్ పోస్ట్..

తాజాగా సత్యదీప్‌ మిశ్రా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మొదటి పెళ్లి గురించి టాపిక్ రాగా అదితిని ఉద్దేశించి.. అదితితో నేను ఉన్న రిలేషన్ కారణంగా నాకు ప్రేమ మీదే విరక్తి కలిగింది. తన వల్ల నాకు ఇంకో ప్రేమ, పెళ్లి అంటే కూడా భయం వేశాయి. సాధారణంగానే బ్రేకప్ అయినవాళ్లు మళ్ళీ ప్రేమ అంటే భయపడతారు, నేను కొన్ని రోజులు భయపడ్డాను. కానీ ఆ తర్వాత ఆలోచించి ధైర్యంగా ముందుకెళ్లి ఇప్పుడు మసాబాని పెళ్లి చేసుకొని అదితి రిలేషన్ లో నేను కోల్పోయిన ఆనందాన్ని పొందగలిగాను అని అన్నాడు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై అదితి ఏమన్నా స్పందిస్తుందేమో చూడాలి.