Satyadev : సత్యదేవ్ ‘హిట్’ కోసం అడివి శేషు.. ఏంటి విషయం?

టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ 'హిట్' కోసం అడివిశేషు కదిలొస్తున్నాడు..

Satyadev : సత్యదేవ్ ‘హిట్’ కోసం అడివి శేషు.. ఏంటి విషయం?

Satyadev : టాలీవుడ్ లో తన వర్సటైల్ యాక్టింగ్ తో అతితక్కువ సమయంలో ఒక మంచి నటుడిగా పేరు సంపాదించుకున్న నటుడు ‘సత్యదేవ్’. ఇటీవలే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ నటించి సినిమాకే ప్లస్ అయ్యాడు. అక్షయ్ కుమార్ ‘రామసేతు’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, అక్కడ కూడా నటుడిగా మార్కులు కొట్టేశాడు. దీంతో వరుస క్రేజీ ఆఫర్లను అందుకుంటున్నాడు ఈ హీరో.

Satyadev: ‘గాడ్‌ఫాదర్’ దెబ్బకు సత్యదేవ్ కూడా డబుల్ చేశాడుగా!

తాజాగా ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కన్నడ ‘మాక్‌టైల్’కి రీమేక్ గా వస్తుంది. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా అనేక వాయిదాలు పడి ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 9న విడుదలవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం జరగనుంది.

ఈ కారిక్రమానికి అడివి శేషు గెస్ట్ గా రానున్నాడు. హైదరాబాద్ జేఆర్‌సి కన్వెన్షన్ హాల్ లో ఈ ఈవెంట్ జరగనుంది. కాగా ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మెగా ఆకాష్, కావ్య శెట్టి, ప్రియా దర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ దర్శకుడు నాగశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మరి రొమాంటిక్ మూవీతో కూడా సత్యదేవ్ మెప్పించగలడో చూడాలి.