Adivi Sesh : మహేష్ బాబు ఫోన్ చేసి మాట్లాడితే ఏడ్చేశాను..

హిట్ 2 సినిమా విజయం సాధించడంతో ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించాడు శేష్. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని.. హిట్ యూనివర్స్ లో మహేష్ బాబుని ఇన్వాల్వ్ చేయండి అన్నా. మీరు చేసే థ్రిల్లింగ్ సినిమాలలో............

Adivi Sesh : మహేష్ బాబు ఫోన్ చేసి మాట్లాడితే ఏడ్చేశాను..

Adivi Sesh :  నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన సినిమా హిట్ 2 థియేటర్స్ లో సందడి చేస్తుంది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో మరో హిట్ కొట్టి ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నాడు శేష్. హిట్ 2 సినిమా విజయం సాధించడంతో ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించాడు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాడు.

ఈ నేపథ్యంలో ఓ అభిమాని.. హిట్ యూనివర్స్ లో మహేష్ బాబుని ఇన్వాల్వ్ చేయండి అన్నా. మీరు చేసే థ్రిల్లింగ్ సినిమాలలో మహేష్ బాబుని చూడాలనుకుంటున్నాను. మహేష్ బాబు హిట్ వర్స్ లో ఉంటే సినిమా ఇంకో లెవెల్ కి వెళ్ళిపోద్ది అని అడిగాడు.

Hansika marriage : నేడే హన్సిక పెళ్లి.. సంగీత్ లో డ్యాన్స్ తో రచ్చ చేసిందిగా..

దీనికి అడివి శేష్ సమాధానమిస్తూ.. ఇలాంటి కథల్లో మహేష్ బాబు గారు సరిపోతారో లేదో చూడాలి. కానీ ఇవాళ ఉదయం మహేష్ సర్ ఫోన్ చేసి నాతో చాలా సేపు మాట్లాడారు. సినిమా విజయం సాధించడంతో నా విషయంలో ఆయన చాలా గర్వంగా ఉన్నాను అన్నారు. అప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక సోదరుడిగా మీకు ఎప్పుడూ తోడు ఉంటాను అని ఆయనకి చెప్పాను. త్వరగా హిట్ 2 సినిమాని ఆయనకి చూపించాలనుకుంటున్నాను” అని తెలిపారు.