Adivi Sesh: ‘గూఢచారి’ ఫ్రాంచైజీలు మరిన్ని వస్తాయంటోన్న అడివి శేష్

టాలీవుడ్‌లో ఇటీవల బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ అందుకున్న యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. ఆయన సినిమా చేశాడంటే అది ఖచ్చితంగా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందనే మార్క్ వేసుకున్నాడు ఈ హీరో. ఇక తాజాగా ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ప్రేక్షకులకు తెలిపాడు. గతంలో ఆయన నటించిన ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌గా ‘G2’ ఉండబోతుందని అడివి శేష్ ఇటీవల ఓ పోస్టర్ ద్వారా వెల్లడించాడు.

Adivi Sesh: ‘గూఢచారి’ ఫ్రాంచైజీలు మరిన్ని వస్తాయంటోన్న అడివి శేష్

Adivi Sesh: టాలీవుడ్‌లో ఇటీవల బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ అందుకున్న యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. ఆయన సినిమా చేశాడంటే అది ఖచ్చితంగా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందనే మార్క్ వేసుకున్నాడు ఈ హీరో. ఇక తాజాగా ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ప్రేక్షకులకు తెలిపాడు. గతంలో ఆయన నటించిన ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌గా ‘G2’ ఉండబోతుందని అడివి శేష్ ఇటీవల ఓ పోస్టర్ ద్వారా వెల్లడించాడు.

Adivi Sesh: అడివి శేష్ G2 ప్రీ-వెర్షన్.. టెర్రిఫిక్.. అంతే!

తాజాగా ఆయన ఈ సినిమాకు సంబంధించి మీడియాతో ముచ్చటించాడు. ఈ క్రమంలో అడివి శేష్ పలు ఇంట్రెస్ట్ంగ్ అంశాలను మీడియాతో పంచుకున్నాడు. గూఢచారి వంటి స్పై థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరణ చూపిస్తారని.. ఇక మున్ముందు గూఢచారి ఫ్రాంచైజీలు కొనసాగుతాయని అడివి శేష్ తెలిపారు. ఇండియన్‌ స్పై ఫ్రాంఛైజీగా గూఢచారి దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని అడివి శేష్ ధీమా వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం ‘G2’ చిత్రాన్ని వినయ్ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించబోతున్నాడని.. అతడికి మంచి విజన్ ఉందని అడివి శేష్ తెలిపారు.

Adivi Sesh : చిరు చేతులు మీదగా అవార్డుని అందుకున్న అడివి శేషు..

హాలీవుడ్ స్పై థ్రిల్లర్లకు ఏమాత్రం తగ్గకుండా ‘G2’ పూర్తి యాక్షన్‌తో రాబోతుందని అడివి శేష్ అన్నారు. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారని.. ఇకపై తన ఫోకస్ పూర్తిగా ఈ సినిమా ఫ్రాంచైజీలపైనే ఉండబోతుందని అడివి శేష్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అడివి శేష్ తెలిపాడు.