Adivi Sesh : సీనియర్ నటి తెరకెక్కించిన సినిమా ట్రైలర్ చూసి ఎమోషనల్ అయిన అడివి శేషు..

వరుస హిట్టులతో ఇండియా వైడ్ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంటున్న హీరో 'అడివి శేషు'. ఇక ఈ సక్సెస్ ఫుల్ హీరో ఇమేజ్ ఇతర సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారు కొందరు మేకర్స్. ఈ క్రమంలోనే నేడు ఒక బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు అడివి శేషు.

Adivi Sesh : సీనియర్ నటి తెరకెక్కించిన సినిమా ట్రైలర్ చూసి ఎమోషనల్ అయిన అడివి శేషు..

Adivi Sesh gets emotional after watching the trailer of Salaam Venky

Adivi Sesh : వరుస హిట్టులతో ఇండియా వైడ్ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంటున్న హీరో ‘అడివి శేషు’. తాజాగా హిట్-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నటుడు అదిరిపోయే హిట్టుని అందుకున్నాడు. విడుదలైన నాలుగు రోజులోనే సినిమా బడ్జెట్ ని రాబట్టి లాభాలతో ముందుకు దూసుకుపోతుంది. ఇక ఈ సక్సెస్ ఫుల్ హీరో ఇమేజ్ ఇతర సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారు కొందరు మేకర్స్.

Adivi Sesh : సాహో తర్వాత సుజీత్‌కి బాలీవుడ్ ఆఫర్స్ చాలా వచ్చాయి.. కానీ..

ఈ క్రమంలోనే నేడు ఒక బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు అడివి శేషు. సీనియర్ నటి రేవతి దర్శకురాలిగా మెగా ఫోన్ పట్టుకొని తెరకెక్కించిన సినిమా ‘సలామ్ వెంకీ’. ఈ చిత్రంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ‘కాజోల్’ వికలాంగుడికి తల్లిగా నటిస్తుంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ అతిధి పాత్ర చేస్తున్నాడు. డిసెంబర్ 9న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది.

దీంతో నేడు హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యింది. ఈ కార్యక్రమానికి అడివి శేషు కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలో అడివి శేషు మాట్లాడుతూ.. “ట్రైలర్ చూస్తే ఆనంద భాష్పాలు వచ్చాయి. నాకు చాలా బాగా నచ్చింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరికి నచ్చేలా ఉంది ఈ కథ” అంటూ ప్రశంసించాడు.