Major Movie: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు డేట్ ఫిక్స్ చేసుకున్న మేజర్

ప్రముఖ ఛానల్ జెమిని టీవీలో మేజర్ చిత్రాన్ని మే 14న సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Major Movie: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు డేట్ ఫిక్స్ చేసుకున్న మేజర్

Adivi Sesh Major Movie Locks World Television Premiere Date

Major Movie: వీరజవాన్ మేజర్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా తెరకెక్కిన ‘మేజర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. దర్శకుడు సాయి కిరణ్ తిక్కా తెరకెక్కించిన ఈ బయోపిక్ మూవీలో యంగ్ హీరో అడివి శేష్ మేజర్ పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయగా, అక్కడ కూడా ఈ మూవీకి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది.

Major Movie : అల్లు అర్జున్ కి థ్యాంక్స్ చెప్పిన మహేష్.. ఎందుకో తెలుసా??

ఈ సినిమాలో అడివి శేష్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని మన కళ్లకు కట్టినట్లుగా చూపెట్టాడు. బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా, శోభిత ధూళిపాల, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా జూన్ 2022లో ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోగా, ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యింది.

Major Movie : ఆ సంఘ‌ట‌న చెబితే న‌మ్ముతారోలేదో అని సినిమాలో పెట్టలేదు

ప్రముఖ ఛానల్ జెమిని టీవీలో మేజర్ చిత్రాన్ని మే 14న సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను సైతం విశేషంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు.