Adivi Sesh: గూఢచారిపై కన్నేసిన మేజర్

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ విలక్షణమైన సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతూ వస్తున్నాడు. అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మేజర్’...

Adivi Sesh: గూఢచారిపై కన్నేసిన మేజర్

Adivi Sesh Shifts Focus To Goodachari2 From Major

Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ విలక్షణమైన సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతూ వస్తున్నాడు. అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మేజర్’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను వీరజవాన్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మేజర్ పాత్రలో అడివి శేష్ యాక్టింగ్ అమోఘంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే చెబుతూ వస్తోంది. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 3వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Adivi Sesh: నెల గ్యాప్‌లో అడవి శేష్ రెండు సినిమాల రిలీజ్.. మహేష్, నానీల సపోర్ట్!

కాగా.. ఈ సినిమా రిలీజ్‌కు పది రోజుల ముందే ప్రీమియర్ షోలు వేస్తూ దేశవ్యాప్తంగా సందడి చేస్తోంది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉండటంతో హీరో అడివి శేష్, ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే గూఢచారి2 చిత్రాన్ని అనౌన్స్ చేసిన అడివి శేష్, ఈ సినిమా షూటింగ్‌ను త్వరలో ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. అబ్బూరి రవి ఈ సినిమాకు డైలాగులను అందిస్తుండగా, రాహుల్ పాకాల ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. గతంలో వచ్చిన గూఢచారి చిత్రం అడివి శేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్ గా గూఢచారి 2 చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఆయన రెడీ అవుతున్నాడు.

Adivi Sesh: సెకండ్ కేస్‌ను పట్టుకొస్తున్న అడివిశేష్.. ఎప్పుడంటే?

ఇక ఈ సినిమాను AK ఎంటర్‌టైన్‌మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. శ్రీచరణ్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. మేజర్ సినిమా రిలీజ్ తరువాత అడివి శేష్ గూఢచారి 2 సినిమాకు షిఫ్ట్ అవుతుండటంతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వారు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.