Adivi Sesh : సత్యదేవ్‌ ని నా ప్రతి సినిమాలో క్యారెక్టర్ చేయమని అడుగుతున్నా.. హిట్ 2లో కూడా అడిగా.. కానీ ఖాళి లేడు..

గుర్తుందా శీతాకాలం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అడివి శేష్ మాట్లాడుతూ.. '' నా క్షణం సినిమాలో సత్యదేవ్ నటించాడు. ఆ తర్వాత సత్యదేవ్ చాలా బిజీ అయిపోయాడు. క్షణం తర్వాత నా ప్రతి సినిమాలో సత్యదేవ్ కోసం.............

Adivi Sesh : సత్యదేవ్‌ ని నా ప్రతి సినిమాలో క్యారెక్టర్ చేయమని అడుగుతున్నా.. హిట్ 2లో కూడా అడిగా.. కానీ ఖాళి లేడు..

Adivi Sesh Speech at Gurtundaa Seetakalam movie pre release Event

Adivi Sesh :  సత్యదేవ్ హీరోగా తమన్నా, మేఘ ఆకాష్, కావ్య శెట్టిలు హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా గుర్తుందా శీతాకాలం. కన్నడలో సూపర్ హిట్ అయిన లవ్ మాక్‌టైల్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా అడివి శేష్ విచ్చేశాడు.

Thalapathy 67 : లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో మొదలుపెట్టేసిన విజయ్.. వంశీ సినిమా అయిపోయిందా?

గుర్తుందా శీతాకాలం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అడివి శేష్ మాట్లాడుతూ.. ” నా క్షణం సినిమాలో సత్యదేవ్ నటించాడు. ఆ తర్వాత సత్యదేవ్ చాలా బిజీ అయిపోయాడు. క్షణం తర్వాత నా ప్రతి సినిమాలో సత్యదేవ్ కోసం క్యారెక్టర్ రాస్తున్నా కానీ అతనికి కుదరట్లేదు. నా ఎవరు సినిమాలో నటించమని అడిగా అప్పుడు డేట్స్ ఖాళీ లేవు అన్నాడు. మేజర్ సినిమాలో యాక్ట్ చేస్తాడేమో అనుకుంటే అప్పటికే పెద్ద హీరో అయిపోయాడు. ఇక హిట్ 2 సినిమాలో కూడా నటిస్తాడేమో అని అడుగుదామనుకున్నా కానీ అప్పటికే గాడ్ ఫాదర్ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇలా నేను ఏ సినిమాలో సత్యదేవ్ కి క్యారెక్టర్ ఇద్దామనుకున్నా అతను ఖాళీగా లేడు. ప్రస్తుతం సత్యదేవ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని తెలిపాడు.