Vishwak Sen: విశ్వక్‌సేన్‌పై ఫిర్యాదు చేస్తా.. పబ్లిక్ ప్లేసెస్‌లో ప్రాంక్ అంటూ ప్రమోషన్ ఏంటి??

ఆదివారంనాడు విశ్వ‌క్ సేన్ ఫిలింన‌గ‌ర్ రోడ్డులో ఓ యువ‌కుడుతో కలిసి ప్రాంక్ పేరుతో సినిమా ప్రమోషన్ చేశాడు. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుంటాను, పెట్రోల్ పోసుకుంటాను........

Vishwak Sen: విశ్వక్‌సేన్‌పై ఫిర్యాదు చేస్తా.. పబ్లిక్ ప్లేసెస్‌లో ప్రాంక్ అంటూ ప్రమోషన్ ఏంటి??

Vishwaksen

Vishwaksen :  యువ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‌సేన్‌ మాస్ సినిమాలతో పాటు క్లాస్ సినిమాలు కూడా చేస్తాను అంటూ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమాతో మే 6న ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు విశ్వక్. ప్రమోషన్స్ లో భాగంగా నడిరోడ్డుపై ఓ యువకుడితో కలిసి ప్రాంక్ అంటూ రచ్చ రచ్చ చేశాడు విశ్వక్సేన్.

ఆదివారంనాడు విశ్వ‌క్ సేన్ ఫిలింన‌గ‌ర్ రోడ్డులో ఓ యువ‌కుడుతో కలిసి ప్రాంక్ పేరుతో సినిమా ప్రమోషన్ చేశాడు. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుంటాను, పెట్రోల్ పోసుకుంటాను అంటూ హడావిడి చేయగా, విశ్వక్ అతనిని ఆపినట్టు డ్రామా చేశాడు. ఇదంతా నడిరోడ్డు మీద చేయడంతో అక్కడి జనాలకి ఇబ్బంది కలిగించింది. ఈ వీడియోని చూసిన వారంతా సినిమా ప్రమోషన్స్‌ కోసం మరీ ఇంత నీచంగా చేయాలా? ప్రమోషన్స్ పేరుతో పబ్లిక్‌ ప్లేస్‌లో ప్రాంక్ లంటూ ఈ న్యూసెన్స్‌ ఏంటి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Vishwak

Chiranjeevi : ఈ లైనప్ ఏంటి బాసు.. మరో సినిమా ఓకే చేసిన మెగాస్టార్.. నిర్మాతగా ఒకప్పటి స్టార్ హీరోయిన్..

తాజాగా ఈ ఘటనపై ప్రముఖ అడ్వొకేట్‌ అరుణ్ కుమార్ స్పందించారు. హీరో విశ్వక్‌సేన్‌పై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేస్తానని అరుణ్‌కుమార్‌ తెలిపారు. పెట్రోల్‌ డబ్బాతో అభిమానిని సూసైడ్‌ చేసుకునేలా వ్యవహరించిన విశ్వక్‌సేన్‌పై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు. సినిమా ప్రమోషన్స్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్, పబ్లిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్స్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలివ్వాలని హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేయనున్నట్టు అరుణ్‌కుమార్ తెలిపారు.

Vishwaksen : నడిరోడ్డుపై న్యూసెన్స్ చేసిన హీరో విశ్వక్సేన్

10 టివితో అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ”ప్రమోషన్స్ పేరిట ఓ ఫ్రాంక్ వీడియో న్యూసెన్స్ చేసిన హీరోపై చర్యలు తీసుకోవాలని పిటీషన్ వేసాను. హీరో విశ్వక్‌సేన్‌పై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు కోరాను. నేను వేసిన పిటిషన్ విచారణకు స్వీకరించింది. పెట్రోల్‌ డబ్బాతో అభిమానిని సూసైడ్‌ చేసుకునేలా వ్యవహరించిన విశ్వక్‌సేన్‌పై చర్యలు తీసుకోవాలి. సినిమా ప్రమోషన్స్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్, పబ్లిక్‌కు అంతరాయం కలిగిస్తున్నరని తెలిపాను. బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్స్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరాం. ఒక హీరో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన యువతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. యూట్యూబ్ లో ఉన్న ఇలాంటి వీడియోలు తీసివేయాలి” అని తెలిపారు.