ఒక్క రోజులోనే 10 లక్షల టికెట్స్ సేల్ : అవెంజర్స్ రికార్డ్

అవెంజర్స్ ఎండ్ గేమ్ టికెట్స్‌ని ఈ నెల 20వ తేదీ నుండే ఆన్ లైన్‌లో అమ్మకానికి పెట్టగా, మొదటి రోజే బుక్ మై షో వెబ్ సైట్‌లో ఏకంగా 10 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.

  • Published By: sekhar ,Published On : April 23, 2019 / 07:58 AM IST
ఒక్క రోజులోనే 10 లక్షల టికెట్స్ సేల్ : అవెంజర్స్ రికార్డ్

అవెంజర్స్ ఎండ్ గేమ్ టికెట్స్‌ని ఈ నెల 20వ తేదీ నుండే ఆన్ లైన్‌లో అమ్మకానికి పెట్టగా, మొదటి రోజే బుక్ మై షో వెబ్ సైట్‌లో ఏకంగా 10 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.

ప్రపంచ సినీ ప్రేమికులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అవెంజర్స్ ఎండ్ గేమ్ ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లోనూ రిలీజవనున్న అవెంజర్స్ ఎండ్ గేమ్ టికెట్స్‌ని ఈ నెల 20వ తేదీ నుండే ఆన్ లైన్‌లో అమ్మకానికి పెట్టగా, మొదటి రోజే బుక్ మై షో వెబ్ సైట్‌లో ఏకంగా 10 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకు మార్వెల్ స్టూడియోస్ వారు నిర్మించిన గ‌త 21 చిత్రాల‌కూ ఇండియాలో ఎంతో ఆదరణ లభించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి పెద్ద ఎత్తున మ‌న దేశంలో అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్‌ను భారీ స్థాయిలో, అత్య‌ధిక థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్నారు.
Also Read : బొమ్మ పడదు : పీఎం నరేంద్ర మోడీ బయోపిక్ మే 19 తర్వాతే

ఈ క్ర‌మంలోనే ఈ సినిమా టిక్కెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడ‌వుతున్నాయి. ఇక ఢిల్లీ, ముంబై, హైద‌రాబాద్ వంటి మెయిన్ సిటీస్‌లోని అన్ని మ‌ల్టీప్లెక్స్‌లు, నార్మల్ థియేట‌ర్ల‌లోనూ అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ టిక్కెట్లు వ‌చ్చే ఆదివారం వ‌ర‌కు బుక్ అయ్యాయ‌ని బుక్ మై షో ప్ర‌తినిధులు చెబుతున్నారు. టిక్కెట్ల‌ను అమ్మ‌కానికి ఉంచిన తొలి రోజే త‌మ సైట్‌లో ఏకంగా 10 ల‌క్ష‌ల టిక్కెట్లు అమ్ముడుపోయాయ‌ని, సెక‌నుకు 18 టిక్కెట్ల‌ను ప్రేక్ష‌కులు కొనుగోలు చేశార‌ని వారు తెలిపారు. దీంతో ఒకే రోజు ఒక వెబ్‌సైట్‌లో అత్య‌ధికంగా టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాగా అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ కొత్త రికార్డు సృష్టించింద‌ని వారు చెప్పారు.

పేటీఎం, జస్ట్ టికెట్ లాంటి సైట్స్‌లోనూ ఫస్ట్ త్రీ డేస్‌కి టికెట్స్ అమ్ముడయిపోయాయి. బాంబేలో, బ్లాక్‌లో ఒక్కో టికెట్ రూ.1500 లు పలుకుతుందట. అక్కడి కార్నివాల్ సినిమాస్‌లో తెల్లవారు ఝామున 3.20 గంటల షోకి కూడా టికెట్స్ అయిపోయాయి అంటే, అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా గురించి ఇండియన్ ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థం అవుతుంది. ఈ సిరీస్‌లో ఇదే చివరి సినిమా కావడం కూడా ఒక కారణమని ట్రేడ్ వర్గాలవారు అంటున్నారు.

వాచ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ తెలుగు ట్రైలర్..