Mosagallaku Mosagadu: 52 ఏళ్ల తరువాత మళ్లీ వస్తున్న ‘మోసగాళ్లకు మోసగాడు’..!

ఫస్ట్ కౌబాయ్ మూవీగా వచ్చిన ‘మోసగాళ్లకు మోసగాడు’ ఒక ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడ ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Mosagallaku Mosagadu: 52 ఏళ్ల తరువాత మళ్లీ వస్తున్న ‘మోసగాళ్లకు మోసగాడు’..!

After 52 Years Mosagallaku Mosagadu To Release Again

Mosagallaku Mosagadu: టాలీవుడ్‌లో ఇటీవల రీ-రిలీజ్ చిత్రాల హవా కొనసాగుతోంది. స్టార్ హీరోల సినిమాను రీ-రిలీజ్ చేస్తూ అభిమానులకు సంతోషాన్ని పంచుతున్నారు మేకర్స్. ఇక ఈ క్రమంలోనే వచ్చిన పోకిరి, జల్సా, ఆరెంజ్ వంటి సినిమాలకు ప్రేక్షకులు పట్టం కట్టారు. అయితే, ఇప్పుడు మరో సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

Mosagallaku Mosagadu : మోసగాళ్లకు మోసగాడు వచ్చేస్తున్నాడు.. రీ రిలీజ్‌కి రంగం సిద్ధం..

ఇండియన్ సినీ చరిత్రలో ఫస్ట్ కౌబాయ్ మూవీగా వచ్చిన ‘మోసగాళ్లకు మోసగాడు’ ఒక ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాలో లెజెండరీ యాక్టర్ కృష్ణ నటించగా, ఈ చిత్రాన్ని KSR దాస్ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడ ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాను మే 31న రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమాను ఆ రోజున రిలీజ్ చేస్తున్నట్లు వారు తెలిపారు.

Super Star Krishna Passed Away: సూపర్ స్టార్ కృష్ణకు కుటుంబ సభ్యుల నివాళి

ఇండియన్ సినిమాకు 70 ఎంఎం, సినిమాస్కోప్, ఈస్ట్‌మెన్ కలర్, DTS, TFI వంటి కొత్త టెక్నాలజీలను పరిచయం చేసిన కృష్ణ, తొలి కౌబాయ్ మూవీని కూడా పట్టుకొచ్చారు. ఈ సినిమాను 4K వర్షన్‌లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాకు ఇప్పటి ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్‌ను అందిస్తారో చూడాలి.