అనర్హులకు అవార్డులా? – రెచ్చిపోయిన రంగోలి

65వ ఫిలింఫేర్ అవార్డుల్లో అనర్హులకు అవార్డులిచ్చారంటూ నటి కంగనా రనౌత్ సోదరి మండిపడింది..

  • Edited By: sekhar , February 16, 2020 / 12:38 PM IST
అనర్హులకు అవార్డులా? – రెచ్చిపోయిన రంగోలి

65వ ఫిలింఫేర్ అవార్డుల్లో అనర్హులకు అవార్డులిచ్చారంటూ నటి కంగనా రనౌత్ సోదరి మండిపడింది..

కంగనా రనౌత్.. టాలెంటెడ్ యాక్ట్రెస్.. ముక్కుసూటిగా మాట్లాడడం, అవతల ఉన్నది ఎంతపెద్ద వ్యక్తి అయినా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం.. ఎప్పుడూ ఏదో ఒక వివాదం కొనితెచ్చుకోవడం మామూలే. కంగనా రనౌత్ చెల్లి రంగోలి ప్రతి విషయంలోనూ అక్కకు బాసటగా నిలుస్తుంది. అక్క మీద ఈగ కూడా వాలనివ్వదు. ఈ ఏడాది ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలో అనర్హులకు అవార్డులిచ్చారంటూ సోషల్ మీడియా వేదికగా మరోసారి వార్తల్లో నిలిచింది రంగోలి.

65వ ఫిలింఫేర్‌ అవార్డుల కార్యక్రమం శనివారం అస్సాంలోని గువాహటిలో అ‍ట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆవార్డుల్లో బాలీవుడ్‌ మూవీ ‘గల్లీబాయ్‌’ చిత్రానికి అవార్డుల పంట పండింది. అత్యధిక విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుందీ చిత్రం. అయితే  ఈ సందర్భంగా రంగోలీ అలియాభట్‌పై విమర్శలు గుప్పించారు.

 

అలియా కంటే బాగా నటించే హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని.. గల్లీబాయ్‌లో ఆమె నటన సాధారణంగా ఉందని.. అలియా ప్రధాన పాత్రలో నటించినప్పటికీ ఆమె సహాయ నటి లాగా కనిపించిందని రంగోలి ఆరోపించింది. అలాంటి ఆమెకు ఉత్తమ నటి అవార్డు ఎలా ఇచ్చారని ఫైర్ అయింది. 

Rangoli Chandel

బాలీవుడ్‌లోని మూవీ మాఫియా గురించి కంగన చాలా సందర్భాల్లో స్పందించిందని.. అందుకే తనకు, తాను నటించిన చిత్రాలకు అవార్డులు ఇవ్వడంలేదని రంగోలీ ఆరోపించడమే కాక, స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2 చిత్రానికి గానూ ఉత్తమ డెబ్యూ నటి అవార్డు అనన్యపాండేకు ఇవ్వడం కంటే ‘పటాఖా’ సినిమాలో నటించిన రాధిక మదన్‌కు ఇస్తే బాగుండేదని అలా ఇస్తే కొత్త వారిని ప్రొత్సహించినట్లు అవుతుందని ట్వీటింది..

రాధిక, అనన్యపాండే కంటే అద్భుతంగా నటించిందని కూడా రాసుకొచ్చింది. అలాగే మణికర్ణిక చిత్రంలో ఝలకరిభాయ్ పాత్రలో నటించిన అంకితను ఉత్తమ సహాయనటిగా ఎంపిక చేసుంటే బాగుండేదని చెప్పింది. దీంతో రంగోలీ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈమె ట్వీట్‌పై అలియా, అనన్యలతో పాటు మిగతా బాలీవుడ్ సినీ జనాలు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలిమరి.