Godfather : RRR తరువాత ఆ ఘనత అందుకున్నది చిరంజీవి గాడ్‌ఫాదర్..
మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా 'గాడ్‌ఫాదర్' రికార్డులు సృష్టిస్తుంది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన 'లూసిఫర్'కు ఇది రీమేక్ గా తెరకెక్కింది. అయితే మోహన్ లాల్ 'లూసిఫర్' ఆల్రెడీ తెలుగు ఓటిటిలో ప్రసారం కావడంతో.. గాడ్‌ఫాదర్ సినిమా బాగున్నప్పటికీ థియేటర్ల వద్ద పరవాలేదు అనిపించింది. కానీ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ లో మాత్రం దుమ్ము దులుపుతుంది.

Godfather : మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా ‘గాడ్‌ఫాదర్’ రికార్డులు సృష్టిస్తుంది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’కు ఇది రీమేక్ గా తెరకెక్కింది. అయితే మోహన్ లాల్ ‘లూసిఫర్’ ఆల్రెడీ తెలుగు ఓటిటిలో ప్రసారం కావడంతో.. గాడ్‌ఫాదర్ సినిమా బాగున్నప్పటికీ థియేటర్ల వద్ద పరవాలేదు అనిపించింది. కానీ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ లో మాత్రం దుమ్ము దులుపుతుంది.
Chiranjeevi : యువ హీరోలపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..
నవంబర్ 19న నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారమవుతుంది ఈ సినిమా. నవంబర్ 20 నుంచి 12 రోజులుగా ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ లో స్ట్రీమింగ్ అవుతూ రికార్డు సృష్టిస్తుంది. కాగా RRR సినిమా 14 రోజులు పాటు మొదటి స్థానంలో స్ట్రీమింగ్ అయ్యి ఫస్ట్ ప్లేస్ లో నిలవగా, దాని తరువాతి స్థానంలో గాడ్‌ఫాదర్ నిలిచింది. ఇదే కంటిన్యూ అయితే గాడ్‌ఫాదర్, ఆర్ఆర్ఆర్ ని దాటుతుంది అనడంలో సందేహం లేదు.
ఇక చిరంజీవి అభిమానులు అయితే, ఇది బాస్ రేంజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఈ వయసులో కూడా చిరంజీవి కుర్రహీరోలకు పోటీ ఇస్తూ.. నిజంగానే బాస్ అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, రవితేజ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.
Megastar #Chiranjeevi Pure Mass Rampage On OTT #GodFather is Trending at No.1 on #Netflix India Continuously For The Past 12 days
Boss @KChiruTweets #SalmanKhan @ActorSatyaDev#Nayanthara @jayam_mohanraja#MegastarChiranjeevi #GodFatherOnNetflix pic.twitter.com/8Nq9Ops6at— Chiranjeevi Army (@chiranjeeviarmy) December 2, 2022