SSMB29: ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌తో మహేష్ సినిమాపై అమాంతం పెరిగిపోయిన అంచనాలు!

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయిలో నిలపడమే కాకుండా, ఆస్కార్ వంటి ప్రెస్టీజియస్ అవార్డును సైతం దక్కించుకుని అందరితో శభాష్ అనిపించాడు. ఇక ఈ సెన్సేషనల్ డైరెక్టర్ ఫోకస్ ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తన నెక్ట్స్ సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేయబోతున్నట్లు జక్కన్న అనౌన్స్ చేశాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అవుతున్నాయి.

SSMB29: ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌తో మహేష్ సినిమాపై అమాంతం పెరిగిపోయిన అంచనాలు!

After RRR Wins Oscar All Eyes On Rajamouli Mahesh Babu SSMB29 Project

SSMB29: దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయిలో నిలపడమే కాకుండా, ఆస్కార్ వంటి ప్రెస్టీజియస్ అవార్డును సైతం దక్కించుకుని అందరితో శభాష్ అనిపించాడు. ఇక ఈ సెన్సేషనల్ డైరెక్టర్ ఫోకస్ ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తన నెక్ట్స్ సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేయబోతున్నట్లు జక్కన్న అనౌన్స్ చేశాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అవుతున్నాయి.

SSMB29: మహేష్-రాజమౌళి మూవీపై కన్నేసిన హాలీవుడ్ బడా కంపెనీ..?

అయితే, ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ రావడంతో, ఇకపై జక్కన్న చేసే సినిమాలన్నీ కూడా గ్లోబల్ స్థాయిలో గుర్తింపును తెచ్చుకోవడం ఖాయం. దీంతో, రాజమౌళి డైరెక్షన్‌లో రాబోయే మహేష్ బాబు మూవీపై అంచనాలు అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ సినిమాను జక్కన్న ఎలాంటి కథతో తెరకెక్కిస్తాడా.. ఈ సినిమాలో మహేష్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే, ఈ సినిమాను ఆఫ్రికాలోని అడవి నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లు రాజమౌళి గతంలోనే వెల్లడించాడు.

SSMB29 : రాజమౌళి-మహేష్ సినిమా అదే.. హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్లో మహేష్ సినిమా గురించి చెప్పిన రాజమౌళి..

ఇక ఈ సినిమాను యూనివర్సల్ కథతో తెరకెక్కించేందుకు జక్కన్న రెడీ అవుతున్నాడట. ఈ సినిమాలో మహేష్ లుక్స్ పరంగా కూడా హాలీవుడ్ హీరోలతో పోటీపడటం ఖాయమని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి మహేష్ సినిమాను గ్లోబల్ ఆడియెన్స్ మెచ్చే విధంగా తీర్చిదిద్దేందుకు జక్కన్న ఎలాంటి కథను రెడీ చేస్తాడా.. ఈ సినిమాను ఆర్ఆర్ఆర్‌ను మించే మూవీగా ఆయన ఎలా తెరకెక్కిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.