Virupaksha : విరూపాక్ష టీజర్ చూసిన పవన్ కళ్యాణ్.. టీంకి అభినందనలు!

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'విరూపాక్ష'. ఈ మూవీ టీజర్ ని అనౌన్స్ చేసిన మేకర్స్.. నేడు (ఫిబ్రవరి 28) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఈ టీజర్ ని చూపించారు. టీజర్ చూసిన పవన్..

Virupaksha : విరూపాక్ష టీజర్ చూసిన పవన్ కళ్యాణ్.. టీంకి అభినందనలు!

after seeing sai dharam tej Virupaksha teaser pawan kalyan Congratulate the whole team

Virupaksha : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’. దాదాపు ఏడాదిన్నర తరువాత సాయి ధరమ్ ఈ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో ఇది 15వ సినిమా. ఈ చిత్రాన్నికి టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథని అందిస్తున్నాడు. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకుడిగా మరి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మిస్టికల్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది.

Pawan Kalyan: పవన్-తేజ్ మూవీ రిలీజ్ ప్లాన్స్.. అప్పుడే అంచనాలు పీక్స్!

ఇక ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్ వరుస అప్డేట్ లు ఇస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బైక్ స్టంట్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీ టీజర్ ని అనౌన్స్ చేసిన మేకర్స్.. నేడు (ఫిబ్రవరి 28) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఈ టీజర్ ని చూపించారు. ప్రస్తుతం పవన్ అండ్ సాయి ధరమ్ ‘వినోదయ సిత్తం’ రీమేక్ షూటింగ్ లో ఉన్నారు. ఆ మూవీ సెట్ లో నిర్మాతలు పవన్ కి విరూపాక్ష టీజర్ చూపించగా, టీజర్ చూసిన పవన్ మొత్తం టీంని అభినందించాడట. ఆ విషయాన్ని తెలియజేస్తూ.. సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. అలాగే కొన్ని ఫోటోలు కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ టీజర్ రేపు (మర్చి 1) రిలీజ్ కాబోతుంది.

కాగా విరూపాక్ష చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హ్యాట్రిక్ విజయాలతో హిట్ హీరోయిన్ అనిపించుకుంటున్న సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని ఏప్రిల్ 21న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్ అండ్ గ్లింప్స్ చూస్తుంటే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక కొత్త అనుభూతి ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.