Miss Universe : మిస్ యూనివర్స్ గెలవగానే నాకే కాల్ చేసింది : ఉపాసన

హర్నాజ్ మిస్ యూనివర్స్ గెలుచుకున్న సందర్భంలో ఉపాసన మీడియాతో మాట్లాడుతూ.. ''పోటీలో గెలిచిన తర్వాత హర్నాజ్ తనకు కాల్ చేసిందని తెలిపింది. ఆమె ఇజ్రాయెల్ వెళ్లే ముందు.....

Miss Universe : మిస్ యూనివర్స్ గెలవగానే నాకే కాల్ చేసింది : ఉపాసన

Miss Universe

Miss Universe :  రెండు దశాబ్దాల అనంతరం మిస్ యూనివర్స్ టైటిల్ ని ఇండియా గెలుచుకుంది. ఇండియా తరపున మిస్ యూనివర్స్ 2021లో హర్నాజ్ కౌర్ సందు పోటీ చేసింది. నిన్న ఇజ్రాయిల్ లో జరిగిన మిస్ యూనివర్స్ ఫినాలే లో ఈ కిరీటాన్ని హర్నాజ్ కౌర్ సందు గెలుచుకుంది. దీంతో మన దేశానికి మూడో మిస్ యూనివర్స్ కిరీటం వచ్చింది. ఈ సందర్భంగా దేశమంతా ఆమెకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

Allu Arjun : గాయపడిన అభిమానులను నా టీమ్ చూసుకుంటున్నారు : అల్లు అర్జున్

బాలీవుడ్ నటి, కపిల్ శర్మ షో ద్వారా పాపులర్ అయిన ఉపాసన సింగ్ ఈ విషయంపై మీడియాతో మాట్లాడింది. తనకి హర్నాజ్ సంధుతో ఉన్న సన్నిహిత బంధాన్ని తెలియచేసింది. హర్నాజ్ మిస్ యూనివర్స్ గెలుచుకున్న సందర్భంలో ఉపాసన మీడియాతో మాట్లాడుతూ.. ”పోటీలో గెలిచిన తర్వాత హర్నాజ్ తనకు కాల్ చేసిందని తెలిపింది. ఆమె ఇజ్రాయెల్ వెళ్లే ముందు నాతోనే ఉండేది. హర్నాజ్ ముంబైకి వచ్చినప్పుడల్లా ఆమె నాతోనే ఉండేది. గతంలో హర్నాజ్ నాకు చాలా వంటలు చేసి పెట్టింది. నాతో ఉన్నప్పుడు ఎప్పుడూ చెప్తూ ఉండేది మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుస్తానని. ఇప్పుడు హర్నాజ్ తన కల నెరవేర్చుకుంది” అని చెప్పింది.

Allu Arjun Fans : బన్నీ ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీఛార్జ్..! ఫ్యాన్స్ మీట్ రద్దు

“కిరీటం గెలిచిన తర్వాత నాకు కాల్ చేసి సాధించానని చాలా భావోద్వేగంతో చెప్పింది. ఫోన్‌లో ఆమె ఆనందం నాకు అర్ధం అయింది. హర్నాజ్‌తో మాట్లాడుతున్నప్పుడు నేను కూడా చాలా భావోద్వేగానికి గురయ్యాను. ఇజ్రాయెల్‌ నుంచి వచ్చిన వెంటనే ముందుగా నా ఇంటికే వస్తానని చెప్పింది” అని ఉపాసన తెలిపారు.