విజయ్‌ని వదలట్లేదుగా.. మళ్లీ రంగంలోకి దిగిన ఐటీ..

దళపతి విజయ్ ఇంటిలో మళ్లీ సోదాలు జరుపుతున్న ఐటీ అధికారులు..

  • Published By: sekhar ,Published On : March 12, 2020 / 08:45 AM IST
విజయ్‌ని వదలట్లేదుగా.. మళ్లీ రంగంలోకి దిగిన ఐటీ..

దళపతి విజయ్ ఇంటిలో మళ్లీ సోదాలు జరుపుతున్న ఐటీ అధికారులు..

ప్రముఖ తమిళ నటుడు, దళపతి విజయ్ ఇంటిపై ఐటీ అధికారులు మరోసారి దాడులు జరిపారు. గురువారం ఉదయం తమిళనాడు పణయూర్ఇల్లంలోని విజయ్ నివాసానికి ఆదాయపు పన్నుశాఖ అధికారుల బృందం చేరుకుని సోదాలు చేపట్టారు. రెండు రోజుల క్రితం విజయ్ నటిస్తున్న‘మాస్టర్’ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న లలిత్ కుమార్ ఇంటిలో సోదాలు జరిపారు. గత నెలలోనూ విజయ్ ఇల్లు, ఆఫీస్‌పై దాడులు జరిగిన సంగతి తెలిసిందే.

ఏజీఎస్ సంస్థ విజయ్, యువ దర్శకుడు అట్లీ కలయికలో ‘బిగిల్’ చిత్రాన్ని నిర్మించింది. స్పోర్ట్స్ అండ్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడమే కాక, సుమారు రూ. 250 నుండి రూ. 300 కోట్ల మేరకు వసూళ్లు సాధించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో మధురైలోని ఏజీఎస్ సినిమాస్ ఆస్తులు, ఏజీఎస్ నివాసాలు, ఫైనాన్షియర్ అన్బు చెళియన్ నివాసంతో పాటు కార్యాలయాలపై ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

పలు దస్తావేజులను పరిశీలించిన ఐటీ అధికారులు ‘బిగిల్’ చిత్రానికి సంబంధించిన ఐటీ వివరాలను సరిగ్గా చూపించలేదని నిర్ధారించడంతో పాటు ‘మాస్టర్’ షూటింగ్ స్పాట్‌కెళ్లి మరీ విజయ్‌ను విచారణ నిమిత్తం తమవెంట తీసుకెళ్లారు అధికారులు.. దీని వెనక రాజకీయకుట్ర ఉందని పలు వార్తలు వచ్చాయి. ఎలాగోలా ఈ వివాదం సద్దుమణిగింది అనుకుంటుండగా ఐటీ అధికారులు విజయ్‌కు మళ్లీ షాక్ ఇచ్చారు. ఈ విషయం గురించి ప్రస్తుతం కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయ్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. 

ఇవీ చదవండి:

పవర్ స్టార్ క్లాప్‌తో సుప్రీం హీరో సినిమా ప్రారంభం..

ప్రముఖ నటుడు కన్నుమూత