Akhil Agent : న్యూ ఇయర్ విషెస్ చెప్పిన ఏజెంట్ అఖిల్.. మేకింగ్ వీడియో అదుర్స్!

అక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం 'ఏజెంట్'. సురేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో భాగంగా ఫిల్మ్ మేకర్స్ అంతా వారివారి సినిమాల నుంచి అప్డేట్స్ ఇస్తుండడంతో, ఏజెంట్ మూవీ టీం కూడా ఒక మేకింగ్ వీడియోని విడుదల చేసింది.

Akhil Agent : న్యూ ఇయర్ విషెస్ చెప్పిన ఏజెంట్ అఖిల్.. మేకింగ్ వీడియో అదుర్స్!

Agent making video released

Akhil Agent : అక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. సురేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథని అందిస్తున్నాడు. సురేంద్రరెడ్డి స్టైలిష్ మేకింగ్ కి వక్కంతం కథ తోడు అయితే, అది కచ్చితంగా హిట్టు కొట్టాల్సిందే. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

Naga Chaitanya: సమ్మర్‌లో ‘కస్టడీ’లో వేస్తానంటోన్న అక్కినేని హీరో!

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో భాగంగా ఫిల్మ్ మేకర్స్ అంతా వారివారి సినిమాల నుంచి అప్డేట్స్ ఇస్తుండడంతో, ఏజెంట్ మూవీ టీం కూడా ఒక మేకింగ్ వీడియోని విడుదల చేసింది. ఇటీవలే ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసిన సురేంద్రరెడ్డి.. న్యూ ఇయర్ కానుకగా ఆ మేకింగ్ వీడియోని షేర్ చేస్తూ విషెస్ తెలియజేశాడు. రిలీజ్ అయిన మేకింగ్ వీడియో చాలా ఇంటెన్సిటీతో ఉంది.

కాగా ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్ గా డెబ్యూట్ ఇస్తుంది. రామబ్రహ్మం సుంకరతో కలిసి సురేంద్రరెడ్డి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. హిప్ హాప్ తమిజ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. కెరీర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి సరైన హిట్టు లేని అఖిల్.. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటాడా? లేదా? చూడాలి.