Agent Movie: టెర్రిఫిక్ వీడియో గ్లింప్స్‌తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఏజెంట్..!

Agent Movie: టెర్రిఫిక్ వీడియో గ్లింప్స్‌తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఏజెంట్..!

Agent Movie Announces Release Date With A Terrific Glimpse

Agent Movie: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, ఈ సినిమా రిలీజ్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే పలుమార్లు వాయిదా వేయడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Agent Movie: కె.విశ్వనాథ్ మృతికి సంతాపంగా ఏజెంట్ అప్డేట్ వాయిదా.. ఎప్పుడో తెలుసా?

ఇక ఈ సినిమా నుండి ఓ మాసివ్ అప్డేట్ రాబోతుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడంతో, అది ఏమై ఉంటుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మాసివ్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఓ పవర్‌ఫుల్ వీడియో గ్లింప్స్ రూపంలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. అఖిల్ ఏజెంట్ మూవీని వేసవి కానుకగా ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ వీడియోలో అఖిల్ వైల్డ్ లుక్‌లో కనిపించి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.

Agent Movie: ఎట్టకేలకు ‘ఏజెంట్’పై మాసివ్ అప్డేట్ వచ్చేస్తుందోచ్!

సురేందర్ రెడ్డి మార్క్ టేకింగ్ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లనుండగా, ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోండగా, స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించారు. హిప్‌హాప్ తమిళ మ్యూజిక్ అందిస్తున్న ఏజెంట్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఏప్రిల్ 28 వరకు వెయిట్ చేయాల్సిందే.