Agent Movie: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న ఏజెంట్

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ క్రియేట్ చేసుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది.

Agent Movie: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న ఏజెంట్

Agent Movie Locks OTT Partner

Agent Movie: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ క్రియేట్ చేసుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమాలో అఖిల్ సరికొత్త అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Agent Movie: ఏజెంట్ ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్‌కు ముహూర్తం ఫిక్స్!

కాగా, ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘మళ్లీ మళ్లీ’ అనౌన్స్‌మెంట్‌ను చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేసింది. ఈ సాంగ్‌ను రేపు సాయంత్రం 7.03 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్నట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది.

Agent Movie: ఎట్టకేలకు ‘ఏజెంట్’పై మాసివ్ అప్డేట్ వచ్చేస్తుందోచ్!

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీ లివ్ ఏజెంట్ చిత్ర డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏజెంట్ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోండగా, మలయాళ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేస్తున్నారు.