Akhanda: బాలయ్య సినిమాకు అఘోరాలు.. ఫ్యాన్స్‌తో ముచ్చట్లు!

అఖండ అదిరిపోయే సక్సెస్ కి అందరూ ఫిదా అయిపోయారు. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు దద్దరిల్లిపోయే రేంజ్ లో సక్సెస్ సాధించి, మరోసారి మాస్ ఆడియన్స్..

Akhanda: బాలయ్య సినిమాకు అఘోరాలు.. ఫ్యాన్స్‌తో ముచ్చట్లు!

Akhanda

Akhanda: అఖండ అదిరిపోయే సక్సెస్ కి అందరూ ఫిదా అయిపోయారు. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు దద్దరిల్లిపోయే రేంజ్ లో సక్సెస్ సాధించి, మరోసారి మాస్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించిన అఖండ సినిమాకు అందరూ అభిమానులై పోయారు. సాధారణ జనాల దగ్గరనుంచి స్టార్ హీరోల వరకూ, అభిమానుల దగ్గరనుంచి అఘొరాల వరకూ అందరూ అఖండ వైపు చూస్తున్నారు.

ProjectK: అచ్చ తెలుగు సంప్రదాయంలో దీపికాకు గ్రాండ్ వెల్‌కమ్

బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా రిలీజ్ అయిన అఖండ అదిరిపోయే సక్సెస్ తో దూసుకుపోతోంది. భారీ అంచనాలతో ఈ గురువారం రిలీజ్ అయిన అఖండ మూవీలో బాలయ్య డైలాగ్స్ కి, యాక్షన్ కి థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఈ సినిమా చూడడానికి సాధారణ ఫాన్స్ తో పాటు స్పెషల్ గెస్ట్ లు కూడా రావడంతో ధియేటర్లు ఫుల్ అయిపోతున్నాయి.

Kate Sharma: పరువాలతో కాటేస్తున్న కాటే శర్మ!

సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన అఖండ సినిమా ఫాన్స్ కి మరో సారి మాస్ పూనకాలు తెప్పించింది. అందుకే స్టార్ హీరోలు కూడా వరుస పెట్టి అఖండ కి బెస్ట్ విషెస్ అందించడమే కాదు.. సినిమా చూసి కాంప్లిమెంట్లు కూడా ఇచ్చారు. టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్.. బాలయ్య బాబాయ్ సూపర్ అంటే.. బాలయ్య బాలయ్య ఇరగదీసావయ్యా అని మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అన్నారు. సినిమా మ్యాసివ్ హిట్ అవడం సంతోషంగా ఉందని మహేష్ బాబు అంటే.. సినిమా సూపర్ డూపర్ హిట్ అని రామ్, నాని బాలకృష్ణ యాక్టింగ్ ని తెగమెచ్చుకున్నారు.

Mohan Babu: సిరివెన్నెల అంత్యక్రియలకు దూరమైన మంచు ఫ్యామిలీ.. కారణమిదే

అఖండ సినిమాలో బాలకృష్ణ అఘోరాగా పవర్ ఫుల్ రోల్ చేశారు. ఈ క్యారెక్టర్ కోసం కంప్లీట్ గా మేకోవర్ అయ్యి ఆ సీరియస్ నెస్ ని మెయింటెన్ చేశారు. అందుకే ఈ పవర్ ఫుల్ అఘోరా క్యారెక్టర్ కి ఫాన్సే కాదు.. నిజమైన అఘోరాలు కూడా ఫిదా అయిపోయారు. అందుకే అఖండ సినిమా చూడ్డానికి ధియేటర్ కి వచ్చి సందడి చేశారు. శ్రీకాకుళం జిల్లా నర్సీపట్నం బంగార్రాజు థియేటర్ కి వచ్చిన అఘోరాలు అఖండ సినిమా చూసి.. బాలయ్య ఫ్యాన్స్ తో మాట్లాడి అక్కడ నుండి బయలుదేరారు. ఇలా స్టార్ హీరోల దగ్గరనుంచి అఘోరాల వరకూ అందరినీ ఎట్రాక్ట్ చేసింది అఖండ మూవీ.