Aha-Arha Media: రెజీనా ప్రధాన పాత్రలో వెబ్ సిరీస్ ప్లాన్స్!

ఇండియాలో ఇప్పుడు సినిమాలతో పోటీగా వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ తో ప్రేక్షకులలో ఇంటర్నెట్ వాడకం పెరగడం.. అందునా ఎంటర్ టైన్మెంట్ లో భాగమైన వెబ్ సిరీస్ లు, ఓటీటీలకు అలవాటుపడిపోయారు. ఫలితంగా మేకర్స్ కూడా ఇప్పుడు వెబ్ సిరీస్ ల మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

Aha-Arha Media: రెజీనా ప్రధాన పాత్రలో వెబ్ సిరీస్ ప్లాన్స్!

Aha Arha Media

Aha-Arha Media: ఇండియాలో ఇప్పుడు సినిమాలతో పోటీగా వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ తో ప్రేక్షకులలో ఇంటర్నెట్ వాడకం పెరగడం.. అందునా ఎంటర్ టైన్మెంట్ లో భాగమైన వెబ్ సిరీస్ లు, ఓటీటీలకు అలవాటుపడిపోయారు. ఫలితంగా మేకర్స్ కూడా ఇప్పుడు వెబ్ సిరీస్ ల మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

తెలుగులో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో దూసుకుపోతున్న ఆహా ఇప్పుడు వరస అచ్చతెలుగు సిరీస్ లను రూపొందించే పనిలో పడింది. రెజీనీ ప్రధాన పాత్రలో తెలుగులో ఓ వెబ్ సిరీస్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా గీతా ఆర్ట్స్ కార్యాలయంలో జరిగిన ఒక ప్రెస్ మీట్ లో.. ఆహా వీడియో మరియు ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చర్చలు జరిగాయి.

ఈ వెబ్ సిరీస్ లో రెజీనా, నివేదిత సతీష్ లు ప్రధాన పాత్రలు పోషించనుండగా ఈ వెబ్ సిరీస్ కు పల్లవి గంగిరెడ్డి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉండగా త్వరలోనే ఈ సిరీస్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు తెలుస్తున్నాయి.