Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్‌కి మరో క్రేజీ న్యూస్ చెప్పిన ఆహా..

బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో.. సెకండ్ సీజన్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో వివరితమైన రీచ్ ని సాధించింది. ఇక ఇటీవల ప్రసారమైన ప్రభాస్ ఎపిసోడ్ కి వచ్చిన రీచ్ గురించి విడిగా చెప్పనవసరం లేదు. దాని దెబ్బకి ఆహా సైట్ సైతం క్రాష్ అయ్యింది. తాజాగా షో నిర్వాహకులు, ఫ్యాన్స్ కి మరో కిక్ ఇచ్చే వార్త ఇచ్చారు.

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్‌కి మరో క్రేజీ న్యూస్ చెప్పిన ఆహా..

aha gave another crazy news to prabhas fans

Prabhas : బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో.. సెకండ్ సీజన్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో వివరితమైన రీచ్ ని సాధించింది. అదిరిపోయే అతిధిలను తీసుకువచ్చి వారి మరో కోణాన్ని బాలయ్య ప్రేక్షకులకు చూపించడంతో మంచి పాపులారిటీని సంపాదించుకుని ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ అనిపించుకుంటుంది. ఇక ఇటీవల ప్రసారమైన ప్రభాస్ ఎపిసోడ్ కి వచ్చిన రీచ్ గురించి విడిగా చెప్పనవసరం లేదు. దాని దెబ్బకి ఆహా సైట్ సైతం క్రాష్ అయ్యింది.

Prabhas : ప్రభాస్ కి యాక్టర్ అవ్వాలని ఎప్పుడు అనిపించిందో తెలుసా?

ఈ బాహుబలి ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చారు షో నిర్వాహకులు. గత కొంత కాలంగా తమ వింటేజ్ ప్రభాస్ ని మిస్ అవుతున్న అభిమానులకు.. మళ్ళీ ఆ డార్లింగ్ ప్రభాస్ ని చూపించినందుకు ఫ్యాన్స్ ఆహా టీంకి థాంక్యూ చెబుతున్నారు. తాజాగా షో నిర్వాహకులు, ఫ్యాన్స్ కి మరో కిక్ ఇచ్చే వార్త ఇచ్చారు. ప్రభాస్ షూటింగ్ కి సంబంధించిన ఆన్ సీన్ వీడియోని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

‘ఇప్పటివరకు ఎప్పుడు చూడని ప్రభాస్ మరో కోణాన్ని చూడడానికి సిద్ధంగా ఉండండి. రేపు (జనవరి 8న) డార్లింగ్ ఎపిసోడ్ బిటిఎస్ వీడియో రిలీజ్ చేయబోతున్నాము’ అంటూ ప్రకటించి ఫ్యాన్స్ ని మరెంత ఖుషి చేసింది. ఇప్పటికే విడుదలైన రెండు ఎపిసోడ్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరి ఈ ఆన్ సీన్ వీడియోస్ ఫ్యాన్స్ ని ఇంకెంత అలరించనున్నాయో చూడాలి. కాగా ఈ ఎపిసోడ్స్ లో ప్రభాస్ తో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ హీరో గోపీచంద్ కూడా పాల్గొని సందడి చేశాడు.