Aha Godari : శ్రీరామనవమి కానుకగా.. ఆహాలో ‘గోదారి’ పేరుతో స్పెషల్ డాక్యుమెంటరీ..

ఆహా గోదారి పేరుతో గోదావరి నదీ అందాలను, విశేషాలను ప్రేక్షకులకు చూపేందుకు స్వాతి దివాకర్ దర్శకత్వంలో ఓ ప్రత్యేక డాక్యుమెంటరీని చిత్రీకరించారు. ఈ డాక్యుమెంటరీ శ్రీరామనవమి కానుకగా.........................

Aha Godari : శ్రీరామనవమి కానుకగా.. ఆహాలో ‘గోదారి’ పేరుతో స్పెషల్ డాక్యుమెంటరీ..

Aha Godari special documentary on Godavari river released in Aha in the occasion of Sri RamaNavami

Aha Godari :  తెలుగు ప్రేక్షకుల అదరాభిమానాలు పొందుతూ ఓటీటీ(OTT) రంగంలో వేగంగా దూసుకుపోతున్న ఆహా(Aha) మరో కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆహా గోదారి పేరుతో గోదావరి(Godavari) నదీ అందాలను, విశేషాలను ప్రేక్షకులకు చూపేందుకు స్వాతి దివాకర్ దర్శకత్వంలో ఓ ప్రత్యేక డాక్యుమెంటరీని(Documentary) చిత్రీకరించారు. ఈ డాక్యుమెంటరీ శ్రీరామనవమి(Sri Ramanavami) కానుకగా మార్చి 30 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది.

త్రయంబకేశ్వర లో తన ప్రయాణాన్ని ప్రారంభించి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ చివరికి అంతర్వేది దగ్గర సాగరంలో కలుస్తుంది మన గోదారి. తన ప్రవాహ ప్రయాణంలో వివిధ రకాల ప్రాంతాలు, మనుషులు, యాసలు, భాషలు, పుణ్యక్షేత్రాలను పలకరిస్తూ, పరవశిస్తూ వారి జీవితాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నది గోదారి. అలాంటి విశేషాలన్నిటిని ఆహా ఈ గోదారి డాక్యుమెంటరీలో నిక్షిప్తం చేసింది.

Saindhav : వెంకీ మామ మాస్ రూపం.. క్రిస్మస్ రిలీజ్‌కి రెడీ అంటున్న సైంధ‌వ్..

ఈ ఆహా గోదారి డాక్యుమెంటరీ ఆహా ఓటీటీ విపణికి ఒక మైలురాయి నిలవనుంది. వినోదరంగంలో వినోద కార్యక్రమలు మాత్రమే కాకుండా, ఈ తరహా డాక్యుమెంటరీలు మరిన్ని వచ్చేందుకు ‘ఆహా గోదారి’ దోహదపడుతుందనడంలో సందేహాం లేదు. ఇలాంటివాటి వల్ల మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు అత్యద్భుతమైన ప్రాచీన కట్టడాల గురించి ప్రేక్షకులకు వివరించే అవకాశం ఉంటుందని ఆహా యాజమాన్యం ఈ డాక్యుమెంటరీ స్పెషల్ ప్రీమియర్ కార్యక్రమంలో తెలిపింది. గోదారి డాక్యుమెంటరీ దర్శకుడు దివాకర్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆహా ఓటీటీ ద్వారా ఈ ఆహా గోదారి డాక్యుమెంటరీని ప్రేక్షకులకు చూపించనుండడం ఎంతో ఆనందంగా ఉండి. ఇంతకుముందెన్నడూ చూడని గోదారి అందాలను ఈ డాక్యుమెంటరీలో చిత్రీకరించాము. గోదావరి నదీ విశిష్ణత, దాని చుట్టూ కోట్ల మంది ప్రజలు అవలంబించే సంస్కృతీ, సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టు ఈ డాక్యుమెంటరీలో చూపించాము అని తెలిపారు.