AHA : ఇప్పుడు బాలయ్య.. త్వరలో వెంకీమామ.. ఆహా అదిరిపోయే ప్లాన్..

తెలుగు ఓటీటీ 'ఆహా' రోజు రోజుకి కొత్త కొత్త సినిమాలతో, కొత్త సిరీస్ లతో కొత్త షోలతో ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఇప్పటికే ఇందులో సమంత, సుమ, వైవా హర్షలతో టాక్ షో.......

AHA : ఇప్పుడు బాలయ్య.. త్వరలో వెంకీమామ.. ఆహా అదిరిపోయే ప్లాన్..

Balakrishna

AHA :  తెలుగు ఓటీటీ ‘ఆహా’ రోజు రోజుకి కొత్త కొత్త సినిమాలతో, కొత్త సిరీస్ లతో కొత్త షోలతో ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఇప్పటికే ఇందులో సమంత, సుమ, వైవా హర్షలతో టాక్ షోలు చేశారు. ఇవి కాకుండా కుకింగ్, గేమ్ షోలు కూడా చేస్తున్నారు. ఇక ఇటీవల ఏకంగా బాలయ్య బాబునే రంగంలోకి దింపి ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షోతో అదరగొట్టారు. ఈ షో ఆహాకి చాలా ప్లస్ అయింది.

బాలకృష్ణ హోస్ట్ చేయడమేంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ బాలయ్య తనదైన శైలిలో వచ్చిన సెలబ్రిటీలతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఇప్పటికే 9 ఎపిసోడ్స్ టెలికాస్ట్ కాగా త్వరలో ఈ సీజన్ లాస్ట్ 10వ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఇప్పటికే ఈ షో రికార్డ్స్ సృష్టిస్తుంది. IMDB లో టాప్ ప్లేస్ లో ఈ షో స్థానం సంపాదించింది. ఈ షో వల్ల ఆహాకి ప్రేక్షకులు పెరిగారు అనటంలో సందేహం లేదు. ఇపుడు బాలయ్యతో నడుస్తున్న ఈ షో అయిపోయిన తర్వాత వెంకీ మామతో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నట్టు సమాచారం.

Kathuri Raja : ధనుష్-ఐశ్వర్యలు మళ్ళీ కలుస్తారు: ధనుష్ తండ్రి

హీరో వెంకటేష్ ఎంత సైలెంట్ గా ఉంటాడో తెలిసిందే. మరి వెంకటేష్ హోస్ట్ గా టాక్ షో అంటే ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి. ఇప్పటికే వెంకటేష్ తో ఆహా టీం సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. వెంకటేష్ ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీకి ఒక వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆహా ఓటీటీకి కూడా ఒప్పుకున్నాడని సమాచారం. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షో పూర్తి అయిన తర్వాత వెంకటేష్ తో షో ప్రారంభిస్తారని తెలుస్తుంది. ఇలా అందర్నీ ఆహా ఓటీటీ కోసం తీసుకొచ్చి కొత్త ఎంటర్టైన్మెంట్ ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అల్లు అరవింద్, ఆహా టీం.