Aha Telugu Indian Idol: అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా కర్టెన్ రైజర్ కార్యక్రమం

దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సింగింగ్ షో 'ఇండియన్ ఐడల్' గురించి తెలిసిందే. హిందీలో పన్నెండు సీజన్లు కంప్లీట్‌ చేసుకున్న ఇండియన్ ఐడల్ షో ఇప్పటి వరకు తెలుగులోకి రాలేదు. ఈషోకు తెలుగు..

Aha Telugu Indian Idol: అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా కర్టెన్ రైజర్ కార్యక్రమం

Aha Telugu Indian Idol

Aha Telugu Indian Idol: దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సింగింగ్ షో ‘ఇండియన్ ఐడల్’ గురించి తెలిసిందే. హిందీలో పన్నెండు సీజన్లు కంప్లీట్‌ చేసుకున్న ఇండియన్ ఐడల్ షో ఇప్పటి వరకు తెలుగులోకి రాలేదు. ఈషోకు తెలుగు వెర్షన్ చేస్తున్నట్టు ‘ఆహా’ ఓటీటీ ప్రకటించింది. తెలుగు సింగింగ్‌ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతోనే ఆహా ఈ సరికొత్త రియాలిటీ షోకు ప్లాన్‌ చేసినట్లు ప్రకటించింది.

AHA : జడ్జిగా మారనున్న నిత్యా మీనన్.. ‘ఆహా’ తెలుగు ఇండియన్ ఐడల్‌లో సరికొత్త ఎంట్రీ

ఈ షోకి ఇండియన్ ఐడల్, బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీరామచంద్ర హోస్ట్ చేయనుండగా.. సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ నిత్యా మీనన్, సింగర్ కార్తిక్ ఈ షోకి జడ్జిలుగా వ్యవహరించనున్నారు. తాజాగా ఆహా ఇండియన్ ఐడల్ షో కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, షోకి జడ్జిలుగా ఉన్న వ్యక్తులతో పాటు సినీ సెలబ్రిటీలు కొందరు హాజరయ్యారు.

Aha OTT: తమిళంలో కూడా ఆహా.. గ్రాండ్‌గా లాంచింగ్!

ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఇండియన్ ఐడల్ షో మన దేశం రాకముందు 50 దేశాల్లో గుర్తింపు దక్కించుకొని ఇక్కడకు వచ్చింది. ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యూజికల్ షో ఇప్పుడు మన హైదరాబాద్ కి వచ్చింది. ఇక్కడున్న స్టేజ్ బిగ్గెస్ట్ మ్యూజికల్ షో.. హిందీలో వచ్చినప్పుడు 5సీజన్ అనుకుంటా ఆ టైంలో మా ఆవిడ శ్రీరామచంద్రకు ఒటు వెయ్యండి అని అడిగింది. ఆడియన్స్ ఆ షోను అపూర్వంగా ఆదరించారు. తెలుగు ఇండియన్ ఐడల్ షో అంటే ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వాళ్ళు పార్టిసిపేట్ చేసే షో. యూఎస్, ఆస్ట్రేలియా నుంచి కాదు ఇతర దేశాల నుంచి కూడా పార్టిసిపెంట్స్ రాబోతున్నారు. ఇది తెలుగులో ప్రపంచ బిగ్గెస్ట్ మ్యూజికల్ షో అని చెప్పొచ్చు. ఈ షోకి జడ్జిగా తమన్, నిత్య మీనన్, కార్తిక్ లు వ్యవహరిస్తారు. నేను ప్రామిస్ చేస్తున్నాను ఈ షోని అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పారు.

AHA : ఇప్పుడు బాలయ్య.. త్వరలో వెంకీమామ.. ఆహా అదిరిపోయే ప్లాన్..

సింగర్ శ్రీ రామచంద్ర మాట్లాడుతూ.. బిగ్గెస్ట్ మ్యూజికల్ షోను అహా వారు మొదటగా సౌత్ ఇండియాలో తెలుగులో తీసుకు వస్తున్నారు. నేను మొదటి సారి తెలుగు ఇండియన్ ఐడల్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాను. 2010లో సింగర్ గా నాజర్నీ స్టార్ట్ అయ్యింది. ఈ షోకి హోస్ట్ గా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. అవకాశాలు రాని ఎంతోమందికి ఈ ప్లాట్ ఫామ్ ఒక వేదిక కాబోతుంది. ఇలాంటి షోని తెలుగులో పరిచయం చేస్తున్న అరవింద్ గారికి అహా వారికి థాంక్స్ అని మాట్లాడారు. కాగా ఆహాలో అతి త్వ‌ర‌లోనే ఈ షో స్ట్రీమింగ్ కానుంది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌పై క్లారిటీ రానుంది.