మార్చి 28 న ఐరా

మార్చి 28 న ఐరా విడుదల..

  • Published By: sekhar ,Published On : February 19, 2019 / 06:23 AM IST
మార్చి 28 న ఐరా

మార్చి 28 న ఐరా విడుదల..

వరస విజయాలతో సత్తా చాటుతున్న లేడీ సూపర్ స్టార్.. నయనతార మొయిన్ లీడ్‌గా, తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్నసినిమా, ఐరా.. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఐరా తెలుగు, తమిళ్ టీజర్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఐరాకి  సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. నయనతార ఈ సినిమాలో యమున, భవానీ అనే రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుంది. పల్లెటూరి గృహిణిగా, మోడరన్ యువతిగా కనిపించినుంది. ఒక క్యారెక్టర్ డీ గ్లామర్‌గానూ, మరో క్యారెక్టర్ గ్లామర్‌గానూ ఉంటుంది. లక్ష్మీ, మా వంటి షార్ట్ ఫిలింస్‌తో గుర్తింపు తెచ్చుకున్న సర్జున్ డైరెక్ట్ చేస్తున్నాడు.. ప్రస్తుతం పొస్ట్‌ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి..

మార్చి 28 న ఐరా సినిమాని రిలీజ్ చెయ్యనున్నట్టు మేకర్స్ తెలిపారు. కలైయరసన్, యోగిబాబు తదితరులు నటిస్తున్నఈ సినిమాకి సంగీతం : సుందరమూర్తి కె.ఎస్. కెమెరా : సుదర్శన్ శ్రీనివాసన్, ఎడిటింగ్ : కార్తీక్ జోగేష్, కథ, స్ర్కీన్ ప్లే : ప్రియాంక రవీంద్రన్, డైలాగ్స్ : శశాంక్ వెన్నెలకంటి, ఫైట్స్ : మిరాకిల్ మైఖేల్ రాజ్, దర్శకత్వం : సర్జున్ కెఎమ్.

వాచ్ ఐరా టీజర్…