Aishwarya Lekshmi: ఆ సినిమాల‌పై న‌మ్మ‌కం లేదు.. న‌టిని అవుతానంటే.. త‌ల్లిదండ్రులే వ‌ద్ద‌న్నారు

మ‌ల‌యాళ భామ ఐశ్వ‌ర్య ల‌క్ష్మి(Aishwarya Lekshmi) టాలీవుడ్ ప్రేక్ష‌కులకు కూడా సుప‌రిచిత‌మే.తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో పాల్టొన్న ఆమె తాను న‌టిని అవుతానంటే త‌న తండ్రులు వ‌ద్దు అన్నార‌ని చెప్పింది

Aishwarya Lekshmi: ఆ సినిమాల‌పై న‌మ్మ‌కం లేదు.. న‌టిని అవుతానంటే.. త‌ల్లిదండ్రులే వ‌ద్ద‌న్నారు

Aishwarya Lekshmi

Actress Aishwarya Lekshmi: మ‌ల‌యాళ భామ ఐశ్వ‌ర్య ల‌క్ష్మి(Aishwarya Lekshmi) టాలీవుడ్ ప్రేక్ష‌కులకు కూడా సుప‌రిచిత‌మే. ‘గాడ్సే’, ‘మ‌ట్టీ కుస్తీ’, ‘అమ్ము’ వంటి చిత్రాలతో ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌రైంది. మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన ‘పొన్నియ‌న్ సెల్వన్ 2’ సినిమాతో మంచి హిట్‌ను అందుకుంది. ఇందులో ఆమె న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో పాల్టొన్న ఆమె తాను న‌టిని అవుతానంటే త‌న త‌ల్లిదండ్రులే వ‌ద్దు అన్నార‌ని చెప్పింది. అలాగే లేడి ఒరియెంటెడ్ సినిమాల‌పై త‌న‌కు న‌మ్మ‌కం లేదంది.

మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చిన ఐశ్వ‌ర్య ఎంబీబీఎస్ పూర్తి చేసింది. సినిమాల్లో న‌టించే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు త‌న ఇంట్లో వాళ్లు అంగీక‌రించ‌లేద‌ని చెప్పింది. సినిమా రంగంపై వాళ్ల‌కు నెగెటివ్ అభిప్రాయం ఉండడ‌మే అందుకు కార‌ణ‌మ‌ని తెలిపింది. తాను న‌టిని కావ‌డం విధి నిర్ణ‌యం కావొచ్చున‌ని, త‌న దృష్టిలో సినీ ఇండ‌స్ట్రీలో కొన‌సాగ‌డం అంత సుల‌భ‌మైన విష‌యం కాద‌ని చెప్పుకొచ్చింది. ప్ర‌తి రోజు పోరాటం చేయాల్సి ఉంటుంద‌ని తెలిపింది. తాను చేసే పాత్ర ప్రేక్ష‌కులకు న‌చ్చేలా చూసుకుంటానంది.

Megastar Chiranjeevi: నేనెప్పుడూ క్యాన్స‌ర్ బారిన ప‌డ‌లేదు.. అలా రాయ‌కండి.. చిరంజీవి ట్వీట్

లేడి ఒరియెంటెడ్ సినిమాల‌పై అభిప్రాయం కోర‌గా త‌న‌కు ఆ సినిమాల‌పై న‌మ్మ‌కం లేద‌ని చెప్పింది. ఆడ‌వాళ్ళు మాత్ర‌మే ప్ర‌ధాన పాత్ర‌లు చేసే క‌థ‌ల‌ను నేను న‌మ్మ‌ను. ఎందుకంటే జీవితంలో స్త్రీలు, పురుషులు అందరూ ముఖ్యమైన పాత్రలు పోషిస్తారని తెలిపింది. ‘త‌న దృష్టిలో సినిమా అంటూ బ్యాలెన్స్‌గా ఉండాల‌ని, మ‌హిళ‌, పురుష పాత్రలు రాసుకున్నా.. అవి లేకుంటే ప్రయోజనం లేదని చెప్పింది. సినిమా అంటే సమాజానికి, మన జీవితాలకు ప్రతిబింబం కావాలి.. మన జీవితాల్లో కూడా బుల్లితెరపై సమతూకం ఉండాలి.’ అంటూ చెప్పుకొచ్చింది.