Aishwarya R. Dhanush: ఐశ్వర్య-ధనుష్ విడాకులు.. ఓ అర్ధం కాని పజిల్!

విడాకులు అనౌన్స్ చేసి నెలలు గడుస్తున్నా.. ఇంకా సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ధనుశ్ పేరు తీసేయలేదు ఐశ్వర్య. ఇప్పుడు చూస్తే, ఐశ్వర్యను ఫ్రెండ్ అంటున్నాడు ధనుశ్. ఫ్యాన్స్ కేమి..

Aishwarya R. Dhanush: ఐశ్వర్య-ధనుష్ విడాకులు.. ఓ అర్ధం కాని పజిల్!

Aishwarya R. Dhanush

Aishwarya R. Dhanush: విడాకులు అనౌన్స్ చేసి నెలలు గడుస్తున్నా.. ఇంకా సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ధనుశ్ పేరు తీసేయలేదు ఐశ్వర్య. ఇప్పుడు చూస్తే, ఐశ్వర్యను ఫ్రెండ్ అంటున్నాడు ధనుశ్. ఫ్యాన్స్ కేమి అర్థంకాక అసలేం జరుగుతోంది వీళ్ల మధ్య అనుకుంటున్నారు. హైపర్స్ కాస్త ముందుకెళ్లి ట్రోలింగ్ తో దులిపేస్తున్నారు. అసలు.. రజనీకాంత్ కూతురు, అల్లుడు.. ఆ రిలేషన్ షిప్ సంగతేంటి అని ఇండస్ట్రీలో కూడా చర్చలు జరుగుతున్నాయి.

Dhanush-Aishwarya : విడాకుల తర్వాత మొదటిసారి ఎదురుపడ్డ ధనుష్, ఐశ్వర్య.. ఒకే పార్టీలో ఇద్దరూ..

మరోసారి ధనుశ్ – ఐశ్వర్యల రిలేషన్ షిప్ ని తెరపైకి తీసుకొచ్చింది. ఐశ్వర్య డైరెక్ట్ చేసిన సంచారి స్పెషల్ వీడియో సాంగ్ రీసెంట్ గా రిలీజైంది. తమిళ్ లో పయని పేరుతో, తెలుగులో సంచారిగా, మలయాళంలో యాత్తక్కారిగా బయటికొచ్చిన ఈ లవ్ సాంగ్ లో జానీమాస్టర్ నటించాడు. అయితే కూతురు తెరకెక్కించిన ఈ మెలోడిని తమిళ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ రిలీజ్ చేయగా.. దాన్ని రీట్వీట్ చేస్తూ ధనుశ్ చేసిన కామెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Aishwarya : ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదు.. ధనుష్‌తో విడాకుల తర్వాత మొదటిసారి స్పందించిన ఐశ్వర్య

ఐశ్వర్యను ఉద్దేశించి కంగ్రాట్స్ మై ఫ్రెండ్ అంటూ ధనుశ్ ట్వీట్ చేశాడు. దానికి థ్యాంక్స్.. గాడ్ స్పీడ్ అంటూ రిప్లై ఇచ్చింది ఐశ్వర్య. అయితే ఇక్కడ జనాలకి అర్థంకాని విషయం ఏంటంటే.. మ్యూచువల్ డైవర్స్ ప్రకటించాక కూడా ఐశ్వర్య తన సోషల్ అకౌంట్స్ నుంచి ధనుశ్ పేరును తొలగించలేదు. అటు చూస్తే.. భార్య స్టేటస్ నుంచి ఐశ్వర్యను ఫ్రెండ్ రోల్ కి షిఫ్ట్ చేశాడు ధనుశ్. దీన్ని బట్టి ధనుశ్ తో ఐశ్వర్య రీకనెక్ట్ అవ్వాలని చూస్తున్నా.. ఈ హీరో మాత్రం దూరమవ్వాలనే డిసైడయ్యాడన్న టాక్ వినిపిస్తోంది.

Aishwarya Dharnush: ధనుష్-ఐశ్వర్య విడాకులు.. వెనక్కు తగ్గారా?

ఈ ఏడాది జనవరి 17న విడిపోతున్నట్టు విడివిడిగా ప్రకటించారు ధనుశ్-ఐశ్వర్య. గతంలో చాలాసార్లు రాజీ కుదిర్చిన రజనీకాంత్ ఈసారి కూడా తనవంతు ప్రయత్నం చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ కలిసే ఛాన్సే లేదన్నది ధనుశ్ ఓపీనియన్. అందుకే ఐశ్వర్య తన పేరు పక్కన ధనుశ్ పేరుని ఉంచినా.. తను మాత్రం స్పష్టంగా ఫ్రెండ్ అనేశాడు. వీళ్లిద్దరూ మళ్లీ ఒకటవుతారనుకున్న ఫ్యాన్స్ మాత్రం ధనుశ్ ని ప్రశ్నిస్తున్నారు. ఏంటన్నా ఇలా చేస్తున్నావ్ అంటూ ట్వీట్ కి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.