Thalaivar169: మరోసారి రజినీతో ఐష్.. రోబో లాంటి బ్లాక్ బస్టర్ అవుతుందా?

సౌత్ లో కెరీర్ బూస్టప్ చేసుకోవాలనుకుంటోంది ఐశ్వర్యరాయ్. ఇప్పటికే మణిరత్నం సినిమాతో బిజీగా ఉన్న ఈ అందాల భామ.. ఇప్పుడు మరో క్రేజీ మూవీకి ఎస్ చెప్పినట్టు వార్తలొస్తున్నాయి.

Thalaivar169: మరోసారి రజినీతో ఐష్.. రోబో లాంటి బ్లాక్ బస్టర్ అవుతుందా?

Thalaivar169

Thalaivar169: సౌత్ లో కెరీర్ బూస్టప్ చేసుకోవాలనుకుంటోంది ఐశ్వర్యరాయ్. ఇప్పటికే మణిరత్నం సినిమాతో బిజీగా ఉన్న ఈ అందాల భామ.. ఇప్పుడు మరో క్రేజీ మూవీకి ఎస్ చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. అదీ సూపర్ స్టార్ సరసన రెండోసారి కావడంతో ఐశ్వర్య స్ట్రాటజీ అదిరిపోయిందనే కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Movie Releases: ప్చ్.. ఈ వారం కూడా సందడి లేని థియేటర్లు!

సూపర్ స్టార్ తో మరోసారి జోడీ కట్టబోతుంది ఐశ్వర్యారాయ్. రోబో తర్వాత రజనీతో మరోసారి అందాలసుందరి నటించబోతుందనే వార్తలు ఫుల్ గా ట్రెండ్ అవుతున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో రజనీకాంత్ తన 169వ సినిమాను రీసెంట్ గా ప్రకటించారు. అనిరుథ్ రవిచంద్రన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లోనే హీరోయిన్ గా ఐశ్వర్యను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.

NBK107: బాబు రెడీ.. యాక్షన్ మొదలుపెట్టిన బాలయ్య!

బాలీవుడ్ లో పెద్దగా యాక్టివ్ గా లేని ఐష్.. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ మూవీ చేస్తుంది. రెండు పార్ట్ లుగా రాబోతున్న ఈ సినిమాలో నందిని, మందాకిని దేవి అనే రెండు రోల్స్ లో నటిస్తోంది. ఇప్పటివరకు సౌత్ లో కేవలం మణిరత్నం, శంకర్ లాంటి డైరెక్టర్స్ కాంబినేషన్లోనే కనిపించింది ఐశ్వర్య. అయితే ప్రస్తుతం సౌత్ సత్తా పెరుగుతుండటంతో ఇప్పటివరకు మూడు సినిమాలే చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్తున్నారు. అన్నింటికి మించి రజనీకాంత్ హీరో కావడం ఆమె ఎస్ చెప్పడానికి మెయిన్ అస్సెట్.

Bheemla Nayak: పవన్ ఎఫెక్ట్.. వెనక్కి తగ్గిన యంగ్ హీరోలు?

ఎంత సూపర్ స్టార్ అయినా రజనీకాంత్ కిప్పుడు సీనియర్ హీరోయిన్స్ అవసరం. గ్లామర్ ఉండాలి.. తనకు మ్యాచ్ కావాలి. మాక్సిమమ్ కొంతకాలంగా నయనతారనే రిపీట్ చేస్తున్న రజనీకాంత్ ఈసారి ఐశ్వర్యపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మిసెస్ బచ్చన్ నటిస్తే పాన్ ఇండియా వైడ్ హెల్ప్ అవవుతుందనేది ఓ రీజన్. సో ఇటు సౌత్ లో పొన్నియన్ సెల్వన్ తో వచ్చే క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ఐశ్యర్యకి.. అటు నార్త్ లో రేంజ్ చూపించడానికి రజనీకి… నెల్సన్ దిలీప్ కుమార్ ప్రాజెక్ట్ యూజ్ కాబోతుంది.