Rajinikanth : రజినీకాంత్ ఇంటిలో చోరీ.. 3.60 లక్షల విలువైన డైమండ్స్ అండ్ గోల్డ్ మాయం..
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటిలో భారీ చోరీ జరిగింది. దాదాపు 3.60 లక్షల విలువైన డైమండ్స్ అండ్ గోల్డ్ చోరీకి గురైనట్లు సమాచారం. ఈ ఘటన గురించి రజినీకాంత్ కూతురు ఐశ్వర్య చెన్నైలోని తేనంపేట పోలీసులకు పిర్యాదు చేసింది. దీని పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 381 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.

Aishwarya Rajinikanth Jewellery robbed from rajinikanth home
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటిలో భారీ చోరీ జరిగింది. దాదాపు 3.60 లక్షల విలువైన డైమండ్స్ అండ్ గోల్డ్ చోరీకి గురైనట్లు సమాచారం. ఈ ఘటన గురించి రజినీకాంత్ కూతురు ఐశ్వర్య చెన్నైలోని తేనంపేట పోలీసులకు పిర్యాదు చేసింది. దీని పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 381 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. కాగా ఐశ్వర్య రజినీకాంత్ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. ఆమెకు సంబంధించిన 60 సవర్ల విలువైన బంగారు మరియు వజ్రాభరణాలు తన లాకర్‌లో భద్రపరిచింది. చివరిగా ఆమె ఆ నగలను 2019లో జరిగిన తన సోదరి సౌందర్య పెళ్లికి ధరించినట్లు వెల్లడించింది.
అప్పటినుంచి ఆ నగలను తన ఆధీనంలో ఉన్న లాకర్‌లోనే భద్రపరిచినట్లు చెప్పుకొచ్చింది. 2021 లో హీరో ధనుష్ తో విడాకులు అయ్యేవరకు ఆ లాకర్ ధనుష్ అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్లు, విడాకులు అనంతరం తన అపార్ట్‌మెంట్‌కు తరలించగా.. గత ఏడాది చివరిగా ఆ లాకర్ ని తన తండ్రి రజనీకాంత్ నివాసానికి మార్చినట్లు ఆమె పేర్కొంది. లాకర్ తాళాలు మాత్రం ఆమె ఫ్లాట్‌లోనే ఉన్నట్లు వెల్లడించింది. కాగా లాకర్‌లో ఆభరణాలు ఉంచినట్లు కొంతమంది ఇంటి సిబ్బందికి తెలుసని.. వారిలో ఇద్దర్ని మరియు ఒక డ్రైవర్‌ను అనుమానితులుగా ఆమె ఎఫ్‌ఐఆర్ లో పేర్కొంది. దీని పై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
Rajinikanth : జై భీమ్ దర్శకుడితో రజినీకాంత్ కొత్త సినిమా అనౌన్స్..
ఇది ఇలా ఉంటే దాదాపు 7 ఏళ్ళ గ్యాప్ తీసుకోని ఐశ్వర్య.. తన కెరీర్ లో మూడో సినిమాని తెరకెక్కిస్తుంది. లాల్ సలాం అనే టైటిల్ ని ఖరారు చేసుకోగా, స్పోర్ట్స్ అండ్ రిలీజియన్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది అని తెలుస్తుంది. గత ఏడాది నవంబర్ నెలలో ఈ మూవీ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. కాగా ఈ సినిమాలో విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్నాడు. రజినీకాంత్ ఒక గెస్ట్ రోల్ తో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ఎ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.